‘భగవత్ కేసరి’ టీజర్ రివ్యూ.. బాలయ్య తెలంగాణ స్లాంగ్ అదుర్స్.. టీజర్ చివర్లో మహేష్ ఫ్యాన్స్ కి పండగేనందమూరి బాలకృష్ణ మరియు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పేరు ‘భగవత్ కేసరి’ అని ఇటీవలే అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. నేడు బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు. సరికొత్త గెటప్ తో బాలయ్య ని కొత్తగా చూపించాడు, ఆయన డైలాగ్స్ కూడా కొత్తగా అనిపించాయి. బాలయ్య తన కెరీర్ లో మొట్టమొదటిసారి తెలంగాణ స్లాంగ్ ని ఉపయోగించాడు. బాలయ్య మార్క్ యాక్షన్ ఉంటూనే, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ని కూడా ఈ సినిమాలో జోడించినట్టు ఈ టీజర్ ని చూసినప్పుడే అర్థం అయ్యింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల బాలయ్య బాబు కి కూతురు గా నటిస్తుంది. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లోనే చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఈరోజు విడుదలైన టీజర్ లో ప్రారంభంలో వచ్చే డైలాగ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా అమితంగా ఆకట్టుకుంది. ‘ రాజు తన వెనుక ఉన్న వందలాది మంది సైన్యాన్ని చూపిస్తాడు. కానీ మొండోడు తనకి ఉన్న ఒకే ఒక్క గుండెని చూపిస్తాడు ‘ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ లో మంచి డెప్త్ ఉండడం తో అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది. ఇక థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. గతం లో ఆయన బాలయ్య తో ‘అఖండ’ మరియు ‘ వీరసింహా రెడ్డి’ వంటి సినిమాలు చేసాడు. ఈ రెండు సూపర్ హిట్ అవ్వడానికి థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యింది. ఇక టీజర్ చివర్లో ట్యాంకర్ మీద ‘Highly Inflammable’ అనే క్యాప్షన్ కి మహేష్ ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే రీసెంట్ గా మహేష్ బాబు హీరో గా నటించిన ‘గుంటూరు కారం ‘ సినిమా టైటిల్ కి క్యాప్షన్ ఇదే కాబట్టి. ఇలా టీజర్ తోనే అందరిని ఎంతో ఆకట్టుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.