వైభవంగా వరుణ్ తేజ్-లావణ్య ఎంగేజ్మెంట్ వేడుక.. మెగా హీరోల సందడి!



మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో అతి కొంతమంది బంధువులు, సన్నిహితుల మధ్య వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకి మెగా హీరోలు హాజరయ్యారని సమాచారం. చిరంజీవి, రామ్‌చరణ్, అల్లు అర్జున్, వైష్ణవ్‌ తేజ్, ఉపాసన తదితర మెగా హీరోలంతా ఈ వేడుకలో సందడి చేశారు.

వరుణ్ తేజ్- లావణ్య
వరుణ్ తేజ్ – లావణ్య

హీరోయిన్ లావణ్య త్రిపాఠి, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ గత ఐదేళ్లుగా డేటింగ్ చేస్తున్నారని సమాచారం. 2017లో మిస్టర్ మూవీ కోసం జత కట్టిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. గత రెండేళ్లుగా వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్‌ గుప్పుమన్నాయి. దీనిపై ఇటీవల మరోసారి వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. జూన్ 9న నిశ్చితార్థ వేడుకకు ముహూర్తం ఫిక్స్ చేశారు. అలా వరుణ్‌ తేజ్‌ లావణ్యల ఎంగేజ్‌మెంట్ వేడుక జరిగింది.

Ram charan upasana

అయితే ఈ వేడుకను అంత రహస్యంగా ఎందుకు చేస్తున్నారన్న దానిపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోవడం వరుణ్ తరపు వారికి ఇష్టం లేదా అంటూ కొందరు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నారు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ లేదు. ఇటీవల లావణ్య పులి మేక టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేశారు.

NIharika

ఇది కూడా సక్సెస్ కాలేదు. జీ 5లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్‌లో లావణ్య పోలీస్ ఆఫీసర్ రోల్ చేయడం విశేషం. అలాగే ఆమె చివరి చిత్రం హ్యాపీ బర్త్ డే సైతం నిరాశపరిచింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ అన్న ఇమేజ్ తో పాటు ఖాతాలో సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ నిలదొక్కుకోలేక పోయింది లావణ్య త్రిపాఠి దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరింది. ఇకపై ఆమె నటనకు గుడ్ బై చెప్తుందేమో అని గుసగుసలు వినిపిస్తున్నాయి.