Ballaya : ఆ విషయం లో బాలయ్య గ్రేట్ అబ్బా..దగ్గరకు పిలిచి మరీ..

- Advertisement -

Ballaya : నందమూరి హీరో బాలయ్య సినిమాలతో బిజిగా వున్నా కూడా అన్ స్టాపబుల్ షో ను మాత్రం వదల్లేదు.. ఆహాలో ప్రసారం అవుతున్న ఈ షోకు మంచి స్పందన వచ్చిన బాలయ్యను ఎప్పుడూ చూడని విధంగా ప్రేక్షకులను అలరించాడు..అందుకే ఇప్పుడు రెండో సీజన్ కూడా ప్రసారం అవుతుంది.సక్సెఫుల్ గా రన్ అవుతున్న ఈ షోలో చాలా మంది సెలెబ్రేటీలను ఇంటర్వ్యూ చేశారు బాలయ్యా.. మొన్నీమద్య పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్ మాత్రం అందరినీ తెగ ఆకట్టుకుంది..ఆ షో ప్రోమోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి..ఇప్పుడు బాలయ్య వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. చిన్నారి పై ప్రేమను చూపించారు..

Ballaya
Ballaya

నిజానికి ఈ వీడియోకు సంబంధించినది మాత్రం ఈరోజు జరగబోయే అన్ స్టాపబుల్ 2 షూటింగ్.. తాజాగా హూస్ట్ గా బాలయ్య, గెస్ట్ గా పవన్ కళ్యాణ్ ఇవాళ హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో షూటింగులో పాల్గోన్నారు. దీంతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.. పవన్ కళ్యాణ్ అంటే రెండు వైపులా పదునున్న కత్తిలాంటి వాడని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూ కూడా, సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు విషయాల్లో బాలయ్య, ప్రశ్నలు వేసే అవకాశం ఉంది. రాజకీయాల్లో పొత్తుల విషయం పై కూడా పవన్ కళ్యాన్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు.. ఆ షో కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఆ ఎపిసోడ్ సంక్రాంతికి స్త్రీమింగ్ చేయనున్నారని తెలుస్తుంది..

Balakrishna And Pawan kalyan
Balakrishna And Pawan kalyan

ఇకపోతే బాలయ్య గురించి ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది.. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ సమయం లో బాలయ్య , అల్లు అరవింద్ మొదలగు యూనిట్ సభ్యులు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు.అప్పుడే ఓ చిన్నారి బాలయ్య అని పిలుస్తుంది.. అది విన్న బాలయ్య ఆ పాపను దగ్గరకు పిలిచి మరీ తనతో కాసేపు ముచ్చటించారు.. ఆ తర్వాత పాపకు ముద్దు పెట్టి పంపించారు.. అది అక్కడున్న వారెవ్వరో వీడియో తీశారు..అది కాస్త చక్కర్లు కొడుతోంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here