Taraka Ratna కి ఉన్న ఆ వ్యసనం వల్లే గుండెపోటు వచ్చిందా..?

taraka ratna


Taraka Ratna : నారాలోకేష్ ‘యువ గళం’ పాదయాత్ర ప్రారంభోత్సవం లో పాల్గొన్న నందమూరి తారకరత్న అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కుప్పకూలిపోవడం నందమూరి అభిమానులను మరియు సినీ పరిశ్రమను శోకసంద్రం లోకి నెట్టేసింది..

ప్రస్తుతం ఆయనకీ బెంగళూరు లో ఉన్న నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ మీద శస్త్ర చికిత్స జరుగుతుంది.. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉన్నప్పటికీ,మరింత కాంప్లికేట్ కాకుండా స్థిరంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్తున్నారు.

taraka ratna
taraka ratna

నిన్న ఉదయం మెగాస్టార్ చిరంజీవి కూడా తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుంది.. త్వరలోనే ఆయన కోలుకుంటాడు అని ఒక ట్వీట్ వెయ్యడం తో అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు..ఇది ఇలా ఉండగా నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితులైన ప్రముఖ నిర్మాత చిట్టి బాబు తారకరత్న కి అలా గుండెపోటు రావడానికి గల ముఖ్యమైన కారణం ని చెప్పి అందరినీ షాక్ కి గురి చేసాడు.

అసలు విషయానికి వస్తే తారకరత్న కి సిగరెట్లు కాల్చే అలవాటు బాగా ఉందట.. రోజు కి రెండు మూడు ప్యాకెట్లు కాల్చేవాడట.. రక్తనాళ్ళల్లో అతనికి ఎక్కువ బ్లాక్స్ ఏర్పడడానికి కారణం అదేనట.. పైగా అతనికి మెలినా అనే అరుదైన వ్యాధి ఉండడం తో ఆయన గుండెకి స్తంట్స్ వెయ్యలేకపోతున్నారట డాక్టర్లు.

taraka ratna health

కానీ నారాయణ హృదయాలయ లో ఉన్న డాక్టర్లు ఎంతో అనుభవం కలిగిన వాళ్ళని, ఇక బ్రతకరు అని అనుకున్న వాళ్ళందరిని బ్రతికించిన చరిత్ర ఉందని, బాలయ్య బాబు కూడా తారకరత్న స్పృహ లోకి వచ్చాడని చెప్పాడు కాబట్టి అతని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండబోదని చిట్టి బాబు ఈ సందర్భంగా తెలిపాడు..

ఇక తారకరత్న బాగోగులు అన్నీ నందమూరి బాలకృష్ణ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు.. రెండు మూడు రోజుల నుండి ఆయనకి సరైన నిద్ర లేదు, త్రింది కూడా లేదు.. అన్నయ్య కొడుకైన సొంత కొడుకు తో ఉన్నంత ప్రేమాభిమానం తారకరత్న పై ఉందని బాలయ్య ని చూస్తే అర్థం అవుతుంది.