Balakrishna – Nagarjuna : బాలయ్య బాబు నాలుకకు నరం ఉండదు..ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు అని ఇండస్ట్రీ లో చాలా మంది చెప్తుంటారు.. అది నిజమే అని బాలయ్య బాబు నిరూపిస్తూనే ఉంటాడు.. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం విజయోత్సవ సభలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.. ఇండస్ట్రీ కి మూలస్తంబాలలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు ని ఆయన కుటుంబాన్ని ‘అక్కినేని తొక్కినేని’ అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ పై అక్కినేని ఫ్యాన్స్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేసారు.
బాలయ్య వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ ఆయన దిష్టి బొమ్మలను దగ్ధం చేసారు..ఇక సోషల్ మీడియా లో కూడా బాలయ్య వ్యాఖ్యలపై రోజు గొడవలు జరుగుతూనే ఉన్నాయి..రీసెంట్ గా ‘అక్కినేని తొక్కినేని’ కామెంట్స్ పై వివరణ ఇస్తూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి దారి తీసింది.
ఒకపక్క అక్కినేని నాగేశ్వర రావు గురించి ఆయనతో తనకి ఉన్న అనుబంధం గురించి గొప్పగా మాట్లాడుతూనే మరో పక్క అక్కినేని వారసులకు నాగేశ్వరరావు గారి మీద ప్రేమే లేదు అన్నట్టు వ్యాఖ్యానించాడు..వివాదాలకు ఫులుస్టాప్ పెడుతాడు అనుకుంటే ఇంకా పెంచేలా చేసాడు బాలయ్య..బాలయ్య కామెంట్స్ చూస్తుంటే నాగార్జున పై ఆయనకీ బాగా కోపం ఉన్నట్టు అర్థం అవుతుంది..ఎందుకు అంత కోపం అనేది మాత్రం రకరకాలుగా చెప్పుకుంటున్నారు సోషల్ మీడియా లో.
కొంతమంది చెప్పేది ఏంటంటే చిరంజీవి కి నాగార్జున అంత గౌరవం ఇవ్వడం బాలయ్య కి నచ్చేది కాదని.. అందుకే మొదటి నుండి నాగార్జున పై బాలయ్య కోపం గా ఉంటాడని అంటున్నారు.. మరికొంతమంది చెప్పేది ఏమిటంటే బాలయ్య బాబు ఆహా మీడియా లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్న స్టాపబుల్’ టాక్ షో కి నాగార్జున ని ముఖ్య అతిథిగా పిలిస్తే నాగార్జున రానని చెప్పడం బాలయ్య బాగా నిరాశకి గురయ్యాడని..అందుకే నాగార్జున మీద కోపం గా ఉన్నాడని చెప్తున్నారు..ఈ రెండిట్లో ఏది నిజమో తెలియాల్సి ఉంది.