Shivatmika Rajasekhar : శివాత్మిక రాజశేఖర్​ భలే ఛాన్స్ కొట్టేసిందిగా.. ఏకంగా ఆ హీరోతో..

Shivatmika Rajasekhar


శివాత్మిక రాజశేఖర్ Shivatmika Rajasekhar .. టాలీవుడ్​ యాంగ్రీ యంగ్​మెన్​ రాజశేఖర్​ గారాల పుత్రిక. ఈ బ్యూటీ తెలుగు తెరపై దొరసాని అనే మూవీతో అరంగేట్రం చేసింది. ఆ సినిమాలో టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. ఈ సినిమా ఆనంద్-శివాత్మికలకు ఫస్ట్ మూవీ. కానీ తొలి సినిమాతోనే ఇద్దరూ తమలోని టాలెంట్​ను బయటపెట్టారు. ఈ మూవీకి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి.

Shivatmika Rajasekhar
Shivatmika rajashekar

బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అంతగా వసూళ్లు రాబట్టలేకపోయినా.. ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను తమ మనసులో దాచిపెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో శివాత్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆమె నటనలో పరిణతి చూసి అసలు అది ఆమె ఫస్ట్ మూవీ అంటే ఎవరూ నమ్మలేరేమో. అంతగా ఆకట్టుకుంది శివాత్మిక. తొలి సినిమా ఆశించినంత హిట్​ కాకపోయినా.. ఈ భామకు ఆఫర్లకు మాత్రం ఏం కొదువలేదు.

రీసెంట్​గా పంచతంత్రం సినిమాతో ప్రేక్షకులను అలరించింది శివాత్మిక. ఈ మూవీ తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్​లో వస్తున్న రంగమార్తండ మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఓ వైపు తెలుగు సినిమాలు చేస్తూనే.. మరోవైపు కోలీవుడ్​లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అంతేకాకుండా వెబ్​ సిరీస్​లోనూ నటిస్తోంది. సోషల్ మీడియాలోనూ శివాత్మిక చాలా యాక్టివ్. తరచూ తనకు సంబంధించిన విషయాలు ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

Shivatmika Rajasekhar Photos

ఇప్పుడు సోషల్ మీడియాలో శివాత్మిక రాజశేఖర్​కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఓ సూపర్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందంటూ న్యూస్ వైరల్ అవుతోంది. అది మామూలు సినిమా కాదట. చాలా పెద్ద బడ్జెట్ మూవీ.. ఇంకా పెద్ద బ్యానర్​లోనట. ఈ సినిమాలో శివాత్మిక ఓ యంగ్ సూపర్ స్టార్ హీరోకు జోడిగా నటించే అవకాశం దక్కించుకుందని సమాచారం.

అయితే ఆ యంగ్ హీరో ఈ మధ్య కాలంలో వరుసగా సక్సెస్ లను దక్కించుకుంటున్నాడు. ఆ హీరోకు జోడిగా శివాత్మిక నటించడం ద్వారా కచ్చితంగా ఆమెకు మంచి పాపులారిటీ లభించడంతో పాటు స్టార్ హీరోలకు జోడిగా నటించే అవకాశాలు వస్తాయని ఇండస్ట్రీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు. శివాత్మిక తాజాగా నటిస్తోన్న మూవీ రంగమార్తాండ. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ‘కృష్ణ వంశీ’ చాలా కాలం తర్వాత ‘రంగమార్తాండ’ అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజుతో తన షూటింగ్‌ పూర్తి అయ్యిందట. దీనికి సంబంధించి రాహుల్ సిప్లిగంజ్ తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. ఈ రోజుతో రంగ మార్తండ షూటింగ్ ముగిసిందని అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేశారు.

ఈ చిత్రానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌ను ఇస్తున్నారని తెలుస్తోంది. దీంతో సినిమాపై మరింత క్రేజ్ రానుందని చిత్రబృందం భావిస్తోంది. ఇక ఇదే విషయాన్నే తెలుపుతూ “తన మెగా వాయిస్ అందిస్తున్నందుకు అన్నయ్య చిరంజీవి థాంక్స్ చెబుతున్నాని” కృష్ణవంశీ ట్విట్టర్ వేదికగా ఆ మధ్య పోస్ట్ చేశారు. ఈ సినిమాలో శివాత్మికది చాలా కీలకమైన పాత్ర అట.