మలయాళీ కుట్టి Anupama Parameswaran .. ప్రేమమ్ సినిమాతో తన సినీ అరంగేట్రం చేయడమే కాకుండా అదే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ మూవీలో కనిపించిన కాసేపు తన రింగుల జుట్టుతో క్యూట్ లుక్స్‌తో కట్టిపడేసింది. ఆ సినిమాతో తెలుగు కుర్రాళ్లు ఈ మలబార్ అందం మాయలో పడిపోయారు.
ఇక ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ వచ్చిన అఆ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది. కాస్త విలనిజం పండించినా.. ఈ భామ అందానికి నటనకు కుర్రాళ్లు మరోసారి ఫిదా అయ్యారు. ఇక అప్పట్నుంచి అనుపమ మాయలోనే ఉన్నారు. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ వరుస అవకాశాలు అందుకుని బిజీ హీరోయిన్ అయిపోయింది.
వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్లో బిజీ హీరోయిన్ అయిపోయింది అనుపమ. కొన్ని సినిమాల తర్వాత వరుస ఫ్లాప్‌లు మూటగట్టుకుంది. ఆ గతేడాది వచ్చిన కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో అనుపమ కెరీర్ మళ్లీ గాడిన పడింది. 18 పేజెస్‌లో అనుపమ నటనకు, అందానికి తెలుగు కుర్రాళ్లు మరోసారి మనసిచ్చేశారు.
సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనుపమ తాజాగా చేసిన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు తన ఖాతాల్లో షేర్ చేసింది. ఇలా పోస్టు చేసిందో లేదో క్షణాల్లో లైకులు, షేర్లతో సోషల్ మీడియా ఓవర్ ఫ్లో అయిపోయింది. ఈ ఫొటోల్లో తన క్యూట్ లుక్స్‌తో మరోసారి కుర్రాళ్ల మనసు దోచేసింది ఈ భామ. ఈ ఫొటోల్లో అనుపమ చాక్లెట్ కలర్ డ్రైస్‌లో కనిపించింది.
చాక్లెట్ కలర్ ఔట్ఫిట్లో గ్రీనరీ ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌లో అనుపమ పోస్టు చేసిన ఫొటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోల్లో ఈ మలయాళ కుట్టి తన మెస్మరైజింగ్ స్మైల్‌తో అందర్నీ మాయ చేస్తోంది. ప్రకృతి ఒడిలో అనుపమ పరమేశ్వరన్ ఎంజాయ్ చేస్తూ ఉన్న ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. తన మెస్మరైజింగ్ స్మైల్‌తో మనసు దోచేస్తుందని పొగిడేస్తున్నారు.