Artist Satya కూతురు ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యిందో తెలుసా..?

- Advertisement -

Artist Satya : ఒక సినిమాకి హీరో హీరోయిన్లు ఎంత ముఖ్యమో క్యారక్టర్ ఆర్టిస్టులు కూడా అంతే ముఖ్యం.మన టాలీవుడ్ లో ఉన్నంత క్యారక్టర్ ఆర్టిస్టులు ఏ ఇండస్ట్రీ లో కూడా లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.కానీ కొంతమంది ఆర్టిస్ట్స్ ని చూస్తే గుర్తుపట్టగలం కానీ, వాళ్ళ పేర్లు మనకి సరిగా తెలియవు.అలాంటి వారిలో ఒక్కరే సత్య కృష్ణన్.హీరోయిన్స్ తో సమానమైన అందం ఉన్న సత్య ఆర్టిస్ట్ కి ఎందుకో ఏ డైరెక్టర్ కూడా హీరోయిన్ రోల్స్ ఆఫర్ చెయ్యలేదు.

Artist Satya daughter Ananya Krishnan
Artist Satya daughter Ananya Krishnan

అన్నీ క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ మాత్రమే దక్కాయి.అలా ఈమె టాలీవుడ్ లో సుమారుగా 60 సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా చేసింది.వాటిల్లో బొమ్మరిల్లు, మెంటల్ కృష్ణ, ఆనంద్ మరియు ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి చిత్రాలు ఆమెకి మంచి పేరు తెచ్చి పెట్టాయి.ఎప్పుడూ సినిమాల్లో యాక్టీవ్ గా ఉంటూ వచ్చే సత్య కృష్ణన్ గత కొంత కాలం నుండి సినిమాలకు దూరం గా ఉంటూ వచ్చింది.

ఈమెతో పాటు పని చేసిన కొంతమంది క్యారక్టర్ ఆర్టిస్టులు ప్రస్తుతం సినిమాల పరంగా యాక్టీవ్ గా లేకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా బాగా యాక్టీవ్ గా ఉంటూ వస్తున్నారు.కానీ సత్య మాత్రం సోషల్ మీడియా కి కూడా దూరం గా ఉంటుంది.అయితే సత్య కూతురు అనన్య కృష్ణన్ కూడా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది..కొంత కాలం క్రితమే ఆమె గ్యాంగ్ స్టర్ గంగరాజు అనే సినిమాలో నటించింది.

- Advertisement -

ఇప్పుడు రీసెంట్ గా ‘ఊ అంటావా మామ..ఊఊ అంటావా మామ‘ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించింది..చూడడానికి హీరోయిన్ తో సరిసమానమైన అందం ఉన్న ఈ అమ్మాయి, తన తల్లి లాగానే క్యారక్టర్ రోల్స్ కి మాత్రమే పరిమితం అవుతుందా,లేదా హీరోయిన్ గా అవకాశాలను సంపాదిస్తుందా అనేది చూడాలి.ఆమెకి సంబంధించిన కొన్ని ఫోటోలను క్రింద ఎక్సక్లూసివ్ గా మీకోసం అందిస్తున్నాము చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here