Animal Movie Review : ‘ఎనిమల్’ మూవీ ఫుల్ రివ్యూ..ఇదేమి టేకింగ్ అండీ బాబోయ్!

- Advertisement -

నటీనటులు : రణబీర్ కపూర్, రష్మిక మండన, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు

నిర్మాతలు : భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురద్ ఖేతాని, కృష్ణ కుమార్.
డైలాగ్స్ : సౌరభ్ గుప్తా
సంగీతం : JAM8 , వీసాకు, మిశ్రా జానీ

Animal Movie Review : ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు మొత్తం ఎంతో ఆత్రుతతో ఎదురు చూసిన పాన్ ఇండియన్ చిత్రం ‘ఎనిమల్’. అర్జున్ రెడ్డి మరియు కబీర్ సింగ్ తర్వాత సందీప్ వంగ నుండి తెరకెక్కిన సినిమా కావడం తో ఈ మూవీ పై యూత్ ఆడియన్స్ లో మామూలు రేంజ్ క్రేజ్ ఉండేది కాదు. దానికి తగ్గట్టుగానే ట్రైలర్ కూడా క్రేజీ గా ఉండడం తో ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆడియన్స్ కంటే ఎక్కువగా టాలీవుడ్ ఆడియన్స్ ఎదురు చూసారు. అలా భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుందో ఈ రివ్యూ లో చూద్దాం.

- Advertisement -
Animal Movie Review
Animal Movie Review

కథ :

విజయ్ (రణబీర్ సింగ్) కి తన తండ్రి బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) అంటే అమితమైన ప్రేమ. బ్లబీర్ సింగ్ ఒక ప్రముఖ ఉక్కు ఫ్యాక్టీరీ కి చైర్మన్. ఎక్కువగా బిజీ లైఫ్ గడపడం తో తన కొడుకు విజయ్ తో కాలం గడిపేందుకు సమయం ఇవ్వడు. దీంతో తండ్రితో విబేధాలు వస్తూ ఉంటుంది. ఆ విభేదాల కారణం గా అతను అమెరికా లో చదుకోవడానికి వెళ్ళిపోతాడు. అక్కడే పెరిగి పెద్దవాడై ఉద్యోగం లో స్థిరపడుతాడు. అలాంటి సమయం లో తన తండ్రి బల్బీర్ పై ఎవరో హత్యాయత్నం చేసాడనే విషయం తెలుసుకొని విజయ్ కి రక్తం మరిగిపోతాది. వెంటనే ఇండియా కి వచ్చి తన తండ్రి పై హత్యాయత్నం చెయ్యాలనుకున్న వాడిపై పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. ఈ క్రమం లో అతనికి ఎదురైనా సంఘటనలు ఏమిటి?, తన తండ్రిని చంపినా వాడిపై పగ తీర్చుకున్నాడా లేదా?, క్లైమాక్స్ సుఖాంతంగా ముగుస్తుందా లేదా విచారకరంగా ముగుస్తుందా అనేది చూడాలంటే వెండితెర మీద చూడాల్సిందే.

విశ్లేషణ :

ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం సందీప్ వంగ టేకింగ్ కి శతకోటి వందనాలు పెట్టొచ్చు. ప్రతి 20 నిమిషాలకు ఒక గూస్ బంప్స్ రప్పించే సన్నివేశాలతో సందీప్ వంగ మార్క్ టేకింగ్ తో ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసాడు. దానికి తగ్గట్టుగానే రణబీర్ కపూర్ నటన వేరే లెవెల్ అనే చెప్పాలి. ఆయన కెరీర్ లో ఇది వరకు ఇంత ఊర మాస్ యాటిట్యూడ్ ఉన్న హీరోయిజం ని ఎవ్వరూ డిజైన్ చెయ్యలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఎత్తు అయితే ఇంటర్వెల్ సన్నివేశం మరో ఎత్తు. ఈ సన్నివేశం ఆడియన్స్ మైండ్ ని బ్లాస్ట్ అయ్యేలా చేస్తుంది. ఫస్ట్ హాఫ్ నిడివి దాదాపుగా ఒక గంట 45 నిమిషాలు ఉంటుంది. ఇది చాలా లెంగ్త్ , కానీ లెంగ్త్ ఎక్కువ అయ్యింది అనే అనుభూతి ఆడియన్స్ కి కలగదు, స్క్రీన్ ప్లే ఆ రేంజ్ లో డిజైన్ చేసాడు డైరెక్టర్.

ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంతమందికి బాగా డ్రాగ్ చేసారు అనిపించొచ్చు, మరికొంత మందికి బాగా కనెక్ట్ అవ్వొచ్చు. మరికొంత మంది అయితే ఛీ ఛీ ఇలాంటి సన్నివేశాలు పెట్టారు ఏంటి?, డైరెక్టర్ కి బుర్ర ఉందా అసలు అనిపించొచ్చు. అంత బోల్డ్ గా తీసాడు సందీప్ వంగ, ఇక ఎండ్ టైటిల్ కార్డ్స్ పడిన తర్వాత సినిమా అయిపోయింది అనుకోని సీట్స్ నుండి మాత్రం లెగవకండి. ఈ ఎండ్ టైటిల్స్ పడిన తర్వాత వచ్చే సన్నివేశం ఆడియన్స్ మైండ్ ని మరోసారి బ్లాస్ట్ చేస్తుంది. ఇలా ఎనిమల్ చిత్రం ఆడియన్స్ కి ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది అనడం లో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక మైనస్ పాయింట్స్ ఏమిటంటే రన్ టైం అనే చెప్పొచ్చు. అలాగే సెకండ్ హాఫ్ లో అనేక సన్నివేశాల్లో డెప్త్ ఉండదు. హీరో కి విలన్ కి మధ్య గొడవ జరగడానికి ఇంకా బలమైన కారణం ఉంటే బాగుంటుంది అని అనిపించింది.

చివరిమాట :

యూత్ ఆడియన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకొని అయినా వెళ్లొచ్చు, వాళ్ళని ఆ రేంజ్ లో సంతృప్తి పరుస్తుంది ఈ చిత్రం.

రేటింగ్ : 2.75/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here