Anchor Suma : సుమారు గా రెండు దశాబ్దాల నుండి తన అద్భుతమైన యాంకరింగ్ స్కిల్స్ తో బుల్లితెర మీద ఏకచక్రాధిపత్యం చేస్తున్న స్టార్ యాంకర్ ఎవరైనా ఉన్నారా అంటే అది సుమ అనే చెప్పాలి..యాంకరింగ్ అంటే ఇలానే చెయ్యాలి అని అనిపించేలా ఆమె యాంకరింగ్ ఉంటుంది..అందుకే ప్రతీ ఏడాది బుల్లితెర మీద ఎంత మంది యాంకర్స్ పుట్టుకొస్తున్నా కూడా సుమ కి ఉన్న డిమాండ్ ని మ్యాచ్ చేయలేకపోతున్నారు.
మేకర్స్ కి బుల్లితెర షోస్ కోసం ఆమెనే కావాలి, అలాగే స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి కూడా సుమనే యాంకర్ గా కావాలి..ఆమెకి తీరిక లేక కొన్ని షోస్ ని ఒప్పుకోలేకపోవల్సిందే కానీ ఆమె డిమాండ్ మాత్రం ఇప్పటికీ ఇసుమంత కూడా తగ్గలేదు..ఈటీవీ లో ఆమె ఇది వరకు ఎన్నో షోస్ కి యాంకర్ గా చేసింది..వాటిల్లో క్యాష్ ప్రోగ్రాం సంచలన విజయం సాధించింది.
ఈ షోస్ కి టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా వచ్చి తమ సినిమాలకు ప్రొమోషన్స్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి..అయితే ఇప్పుడు ఈ షో కి బదులుగా ‘సుమ అడ్డా’ ప్రోగ్రాం గత కొద్దీ రోజుల క్రితమే ప్రారంభమైంది..మొదటి ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి తన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ టీం తో హాజరయ్యాడు..రెండవ ఎపిసోడ్ కి టాప్ కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్ మరియు జానీ మాస్టర్ హాజరయ్యారు.
మొదటి ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి తో సరదాగా సాగిపోయినప్పటికీ, రెండవ ఎపిసోడ్ లో మాత్రం సుమ అడల్ట్ జోక్స్ ఎక్కువ అయిపోయాయి..అవి నేటి తరం యువకులకు బాగా కనెక్ట్ అవుతాయి కానీ , సుమ ని మొదటి నుండి అభిమానించే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం కాస్త ఇబ్బందికి గురి అవుతున్నారు..’ఏమిటి ఈమె హద్దులు మీరు యాంకరింగ్ చేస్తుంది’ అని పెదవి విరుస్తున్నారు.. సుమ అడల్ట్ జోక్స్ పై ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా సీరియస్ అయ్యినట్టు తెలుస్తుంది.. మరి తర్వాత ఎపిసోడ్ నుండైనా సుమ అడల్ట్ జోక్స్ మోతాదు తగ్గిస్తుందో లేదో చూడాలి.