Megha Akash : గ ఘ గ ఘ మేఘా.. బ్లాక్​డ్రెస్​లో మతిపోగొట్టావే



మేగా కాదు.. మేఘా.. ఘా.. వొత్తు ఘా.. అంటూ తన పేరును తెలుగు తెరపై నొక్కివక్కాణించి మరీ చెప్పింది Megha Akash . నితిన్ సరసన నటించిన లై మూవీతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది ఈ క్యూటీ. ఆ తర్వాత నితిన్​తోనే మరో మూవీ చల్​మోహన రంగలో నటించి ప్రేక్షకులను అలరించింది.

Megha Akash
Megha Akash

తమిళనాడులోని చెన్నైలో అక్టోబ్ 26 1995న పుట్టింది ఈ క్యూటీ. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తోంది. చల్​మోహన రంగాలో మేఘా సుబ్రమణ్యం అనే పాత్రలో నటించిన ఈ భామ.. మేగా కాదు.. మేఘా వొత్తు ఘా అని చెప్పిన డైలాగ్​ తెలుగు ప్రేక్షకుల మదిలో చిరకాలం నిలిచిపోతుంది.

Megha Akash Photos

శాటిలైట్ శంకర్ అనే మూవీలో సూరజ్ పంచోలితో నటించి బాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది ఈ చెన్నై చిన్నది. 2018లో సైమా అవార్డ్​సో ఉత్తమ తొలి చిత్ర కథానాయికగా నామినేట్ అయింది. ఇటు తెలుగు, అటు హిందీలో నటిస్తోన్న మేఘా రజినీ కాంత్ పెటా మూవీతో కోలీవుడ్​లో అరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో మేఘా నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి.

Megha Akash Stills

గతేడాది రాజరాజ చోర, కన్నడ మూవీ దియా రీమేక్ మేఘాలో నటించి ప్రేక్షకులను మరోసారి తన నటనతో మాయ చేసింది. ప్రస్తుతం రవితేజతో కలిసి రావణాసుర అనే మూవీలో నటిస్తోంది. క్యూట్ క్యూట్​గా ఉండే మేఘాకు మూడు భాషల్లో నటిస్తున్నా అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు.

Megha Akash Black Dress Photos

ప్రేక్షకులు తనను మరిచిపోకుండా మేఘా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్​గా ఉంటుంది. తరచూ తన లేటెస్ట్ ఫొటోషూట్లతో ఫ్యాన్స్​ని అలరిస్తుంది. మేఘా ఫొటో షూట్లలో హాట్​నెస్ కంటే ఎక్కువ క్యూట్​నెస్​ కనిపిస్తుందని ఫ్యాన్స్ అంటుంటారు. లేటెస్ట్​గా మేఘా పోస్టు చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్​ డ్రెస్​లో మేఘా చాలా అందంగా కనిపిస్తోంది. ముద్దు ముద్దుగా ఉన్నావమ్మా మేఘా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Tags: