యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆది పురుష్’ చిత్రం వచ్చే నెల 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ ఈ నెల నుండి 15 తేదీ వరకు నాన్ స్టాప్ చెయ్యాలని నిర్ణయించారు మేకర్స్.
ఇది ఇలా ఉండగా నిన్న మొన్నటి వరకు ఈ చిత్రం ‘ట్రిబెకా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ లో 13 , 14 మరియు 15 తేదీలలో ప్రదర్శింపచేయాలని అనుకున్నారు మేకర్స్. తద్వారా చిత్రానికి పబ్లిసిటీ ఇంటర్నేషనల్ వైడ్ గా జరుగుతుందని భావించారు. కానీ ఇప్పుడు ఈ ఈవెంట్ లో ఆదిపురుష్ చిత్ర ప్రదర్శనలు క్యాన్సిల్ అయ్యాయని తెలుస్తుంది. ఈ వార్త ఇప్పుడు అభిమానులు చాలా తీవ్రమైన నిరాశకి కి గురి చేసింది.
ఎందుకంటే విడుదల కంటే ముందే ప్రదర్శించడం వల్ల టాక్ తెలిసిపోతుంది, పాజిటివ్ అయితే ఓకే, కాలం ఒకవేళ నెగటివ్ టాక్ వస్తే సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వ్యాప్తి చెందుతుంది,అందుకే ఆ సాహసం చెయ్యకుండా, 15 వ తారీఖున అమెరికా లోని ప్రీమియర్ షోస్ తో ప్రారంభించడమే బెస్ట్ అనే నిర్ణయానికి వాచినట్టు సమాచారం. దీంతో సినిమా ఔట్పుట్ పై అభిమానుల్లో బన్హయం నెలకొంది.
అంతకు ముందు సినిమాని మూడు రోజుల ముందే ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శిస్తున్నారు.విడుదలకు ముందే ఇలాంటి డేరింగ్ స్టెప్ తీసుకున్నారు అంటే సినిమా అదిరిపోయి ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు వెనకడుగు వెయ్యడం తో ఫ్యాన్స్ లో కంగారు మొదలైంది. కానీ ట్రైలర్ మాత్రం అదిరిపోయింది, చూస్తున్నంత సేపు మనం శ్రీ రాముని కాలం లోకి అడుగుపెట్టామా అనే రేంజ్ అనుభూతిని కలిగించింది, చూడాలి మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టిస్తుందా, లేదా చతికిల పడుతుందా అనేది.