PKSDT మూవీ అప్డేట్ వచ్చేసిందోచ్..పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పూనకాలే..

- Advertisement -

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా ఉన్న సినిమా #PKSDT .. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి అయ్యింది. ఒక పాట మరియు ఒక ఫైట్ మాత్రమే బ్యాలన్స్ ఉందట. జులై 28 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నట్టు ఇది వరకే అధికారిక ప్రకటన కూడా చేసారు మేకర్స్.. సినిమా విడుదల అవ్వడానికి కేవలం ఒక నెల మాత్రమే ఉంది.. దాంతో సినిమా పై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి..

PKSDT మూవీ
PKSDT మూవీ

ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ని అధికారికంగా ప్రకటించలేదు. ఇది ఫ్యాన్స్ కి చాలా చిరాకు కలిగిస్తున్న విషయం. సోషల్ మీడియా ద్వారా #BRO అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ మూవీ టీం నుండి ఇంకా క్లారిటీ రాలేదు. దీనితో ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ని ట్యాగ్ చేసి బండబూతులు తిడుతున్న విషయం తెలిసిందే.. నిజానికి ఈ సినిమా టైటిల్ ను 12 తేదీన అనౌన్స్ చెయ్యాలని అనుకున్నారు.. కానీ అది పోస్ట్ ఫోన్ అయ్యింది.. కానీ అదే సమయం లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని విడుదల చెయ్యబోతున్నాము అని ప్రకటన రావడం తో #PKSDT మేకర్స్ తాత్కాలికంగా నిలిపివేశారు.

ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ సినిమా టైటిల్, టీజర్ వీడియోను మే 18 న విడుదల చెయ్యనున్నారని ఒకపోస్ట్ ను విడుదల చేశారు.. ఈ పోస్టర్ విడుదలైన కొద్ది నిమిషాలకే వైరల్ అవుతుంది.. లైకులు, షేర్స్ తో ట్రెండ్ అవుతుంది… ఇకపోతే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు #OG మూవీ కి సంబంధించిన అప్డేట్స్ వరద లాగ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందుకే #PKSDT టైటిల్ ఏముంటుందా అని ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here