Akshay Kumar : అతణ్ని హర్ట్ చేయడం వల్ల బాలీవుడ్ స్టార్​ అక్షయ్ కుమార్​కు రూ.500 కోట్లు నష్టం..?

- Advertisement -

బాలీవుడ్​లో ఏడాదికి అరడజను సినిమాలు చేసే హీరో ఎవరు..? హిందీ ఇండస్ట్రీలో తన సినిమాతో ఈజీగా రూ.100 కోట్లు సంపాదించగల హీరో ఎవరు..? క్షణం తీరికలేకుండా ఓవైపు సినిమాలు.. మరోవైపు యాడ్స్​తో బిజీబిజీగా ఉండో స్టార్ ఎవరు..? ఈ ప్రశ్నలన్నింటికి ఒకటే సమాధానం. అదే బాలీవుడ్ కిలాడీ స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఇంత క్రేజ్ ఉన్న అక్షయ్​కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోందట. ఓ నిర్మాతను హర్ట్ చేయడం వల్ల అక్కీ ఏకంగా రూ.500 కోట్లు నష్టపోయాడట. అసలేం జరిగిందంటే..?

ఇటీవలే బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ హెరాఫెరీ సిరీస్ నుంచి అక్షయ్ వైదొలిగినట్టు ప్రకటన వెలువడింది. హెరాఫెరీ-3 స్క్రిప్టు తనకు నచ్చలేదని అందుకే తిరస్కరించానని అక్షయ్ ఒక బహిరంగ వేదిక పై ప్రకటించడంతో నిర్మాత ఫిరోజ్ నడియావాలా చాలా హర్ట్ అయ్యారు. అంతే అక్కీ ప్రవర్తనతో బాధపడ్డి ఫిరోజ్ తాను తదుపరి నిర్మించే ఆవారా పాగల్ దీవానా-2, వెల్​కమ్-3 సినిమాల నుంచి అక్షయ్​ను తొలగించాలని ఫిక్స్ అయ్యారట. హెరాఫెరీ ఎంత హిట్ మూవీయో తెలిసిందే. దానీ సీక్వెల్​ స్క్రిప్టు నచ్చలేదని ఆఫర్ తిరస్కరించడంతో అక్షయ్ దాదాపు 100 కోట్లు మిస్ అయినట్లే. ఇక మరో రెండు సీక్వెల్స్ వాటి పారితోషికం, లాభాల్లో వాటతో మరో 400 కోట్లు మొత్తం రూ.500 కోట్ల డీల్ అక్షయ్ నష్టపోయాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Akshay Kumar
Akshay Kumar

మోస్ట్ అవైటెడ్ `హెరాఫెరీ 3`కి సంబంధించి గత వారంలో మీడియాలో రకరకాల కథనాలొచ్చాయి. నవంబర్ 11న పరేష్ రావల్ ఎవరూ ఊహించని విధంగా బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ `హెరాఫెరీ 3`ని తన ఖాతాలో వేసుకున్నాడని ఓ కార్యక్రమంలో చెప్పారు. ఇంతకుముందే బ్లాక్​బస్టర్ ఫ్రాంఛైజీ భూల్ భులయ్యా సీక్వెల్లోనూ అక్షయ్ స్థానంలో యువ హీరో కార్తీక్ అవకాశం దక్కించుకుని బంపర్ హిట్ కొట్టి చూపించాడు. భూల్ భులయ్యా-2లో అక్షయ్ అవకాశం కోల్పోవడానికి కారణం అతడు దాదాపు రూ.90 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడమేనని బీటౌన్​లో టాక్. అంత పెద్ద మొత్తం డిమాండ్ చేయడంతో నిర్మాత ఫిరోజ్అ క్షయ్​ను కాదనుకుని కార్తీక్ ఆర్యన్​తో ముందుకు వెళ్లి సూపర్ హిట్ కొట్టాడు. అక్షయ్ కోసం రూ.90 కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో వాటా ఇవ్వాలి. కానీ కార్తీక్ ఆర్యన్ కు రూ. 30 కోట్లు ముట్టజెబితే సరిపోతుందనుకున్న ఫిరోజ్ కార్తీక్​కే జై కొట్టాడు.

- Advertisement -

హెరాఫెరీ 3 లో భాగం కాలేకపోవడంపై అక్షయ్ కుమార్ చాలా బాధపడ్డాడట. ఎందుకంటే అతని కెరీర్​లోనే ఈ ఫ్రాంచైజీకి ప్రత్యేక స్థానం ఉంది. అక్షయ్ తన పారితోషికాన్ని ఇతర డిమాండ్లను తగ్గించుకునేందుకు నిరాకరించాడని.. ఇది వన్-వే స్ట్రీట్ కాకూడదు.. నిర్మాత నష్టపోతున్నప్పుడు అక్షయ్ మాత్రమే డబ్బు సంపాదించడం సరికాదని నిర్మాత ఫిరోజ్ అభిప్రాయపడ్డారు. ‘కరోనా అనంతరం పరిస్థితులు మారిపోయాయి. హీరోలు పారితోషికాన్ని తగ్గించడం తప్ప  వేరే మార్గం లేదు. కానీ అక్షయ్ దానికి ససేమిరా అన్నాడు. అయినా ఎంతో ఓపిగ్గా అక్షయ్​కు ప్రస్తుత పరిస్థితులు వివరించడానికి ట్రై చేశాను కానీ అతను ఒప్పుకోలేదు’ అని ఫిరోజ్ ఓ ఛానెల్​తో అన్నారు.

ఏదేమైనా అక్షయ్ కుమార్​కు బ్యాడ్ టైమ్ రన్ అవుతోంది. ఈ ఏడాది అతడు నటించిన సినిమాలన్నీ డిజాస్టర్లు అయ్యాయి. దీనికి తోడు బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీలన్నిటి నుంచి అవకాశాలు కోల్పోతున్నాడు. కేవలం ఈ మూడు నెలల్లోనే అక్షయ్ కి దాదాపు 500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టేనని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here