Bhumi Pednekar : బ్లాక్​, వైట్ డ్రెస్సుల్లో హీటెక్కిస్తున్న భూమి హాట్ పోజులు



Bhumi Pednekar.. క్యాస్టింగ్ డైరెక్టర్​గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ ఆయుష్మాన్ ఖురానాతో దమ్ లగా కే హైసా మూవీతో బాలీవుడ్​లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అందుకొంటూ దూసుకెళ్తోంది. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా ఈ బ్యూటీ బాలీవుడ్​లో మాత్రం తన జోష్ చూపిస్తోంది.

తొలి సినిమాతో 130 కిలోల బరువుతో కనిపించిన భూమి.. అమాంతం 60 కిలోలు తగ్గి నాజూగ్గా తయారయింది. ఇక వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. టాయిలెట్, శుభ్ మంగళ్ సావధాన్, శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్, పతి పత్నీ ఔర్ వో, సోన్​చరియా, దుర్గామతి, బదాయి దో, రక్షాబంధన్ సినిమాలతో బీ టౌన్ ప్రేక్షకులను అలరించింది.

Bhumi Pednekar
Bhumi Pednekar

ఓవైపు సినిమాలు.. మరోవైపు యాడ్స్​ చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ తరచూ ఫొటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్​ని అట్రాక్ట్ చేస్తోంది. ఇక రీసెంట్​గా గ్లామర్ డోస్ పెంచిన భూమి అందాలు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. దీపావళి అంటే బాలీవుడ్​లో పార్టీల పండుగే. ఇక ఈ దీపావళికి భూమి తన చెల్లెలు సమీక్షతో కలిసి బీటౌన్ సెలబ్రిటీలకు పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో పెడ్నేకర్ సిస్టర్స్ ఔట్​ఫిట్స్ తెగ వైరల్ అయ్యాయి.

ఈ పార్టీలో ముఖ్యంగా భూమి ఔట్​ఫిట్ తెగ వైరల్ అయింది. ట్రెడిషన్​వేర్​లో హాట్​గా కనిపించి భూమి యువకులను మనసు కొల్లగొట్టేసింది. ఇక అప్పటి నుంచి భూమి గ్లామర్ డోస్ పెంచేసింది. తరచూ ఫొటో షూట్లతో హాట్ పోజులిస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది.

తాజాగా భూమి ఫొటోషూట్​ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బ్లాక్ డ్రెస్​లో ఈ బ్యూటీ ఘాటు పోజులిస్తూ హీటు పుట్టించేసింది. రెచ్చగొట్టే పోజులతో కుర్రకారు మతి పోగొడుతోంది.

ఇక వైట్ డ్రెస్​లో భూమి ఏంజిల్​లా కనిపిస్తోంది. ఓవైపు ఏంజిల్​గా కనిపిస్తూనే మరో వైపు తన హాట్​నెస్​తో కుర్రాళ్లను చంపేస్తోంది. ఇక ఘాటు పోజులతో కుర్రాళ్లను మాయ చేస్తోంది. మొత్తానికి భూమి బ్లాక్ అండ్ వైట్ ఔట్​ఫిట్​లో ఫొటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి.