SS Thaman : ఆ సినిమా చూసి వెక్కి వెక్కి ఏడ్చిన తమన్SS Thaman : తెలుగు వాళ్లు ఎవరినైనా అభిమానిస్తే ప్రాణం ఉన్నంత వరకు ఆ అభిమానం కొనసాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా సినిమా వాళ్ల విషయంలో ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది. సాధారణంగా తమ ఫేవరెట్ హీరోలు కనిపిస్తేనే చాలా మంది ఉబ్బితబ్బిబ్బైపోతారు. కొందరైతే ఎమోషనల్ అయి ఏడుస్తుంటారు కూడా. ఇక తమ అభిమాన హీరోతో కలిసి పనిచేయాల్సి వస్తే వాళ్ల ఆనందానికి అవధులుండవు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది.

SS Thaman
SS Thaman

తమన్.. తెలుగు ప్రేక్షకులకు ఇది పరిచయం అక్కర్లేని పేరు. బిజినెస్ మేన్, మిరపకాయ్, అలవైకుంఠపురంలో, అఖండ వంటి సినిమాలతో తన మ్యూజిక్ మ్యాజిక్ ఏంటో ప్రూవ్ చేశాడు. అఖండలో బీజీఎం అయితే సినిమాకే హైలైట్. ఆ మూవీకి ప్రాణం పోసింది తమన్ బీజీఎం అనే చెప్పుకోవచ్చు. తాజాగా తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా నటించిన వారిసు మూవీకి తమన్ మ్యూజిక్ చేశారు. ఈ సినిమాలో రంజితమే పాట ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

తాజాగా కోలీవుడ్‌ నటుడు విజయ్‌పై ఉన్న అభిమానాన్ని మరోసారి వ్యక్తం చేశారు సంగీత దర్శకుడు తమన్‌. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘వారిసు’. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కాబోతోంది. తాజాగా చిత్రాన్ని చూసిన తమన్‌ భావోద్వేగానికి గురై ట్వీట్‌ చేశారు. “విజయ్‌ అన్నా.. సినిమాలోని ఎమోషనల్‌ సీన్స్‌ చూసి ఏడ్చేశా. కన్నీరు విలువైంది. వారిసు సినిమా నా హృదయాన్ని హత్తుకుంది. ఇంతటి పెద్ద అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్‌. లవ్‌ యూ అన్నా” అని తమన్‌ పేర్కొన్నారు. విజయ్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్‌ చేశారు.

యాక్షన్‌కంటే ఎక్కువగా ఈ సినిమాలో ఎమోషనే ఉంటుందని చిత్ర బృందం ప్రచారంలో భాగంగా తెలియజేసింది. ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాని తెరకెక్కించారు. రష్మిక కథానాయిక. ఈ సినిమాలో హీరో సోదరులుగా సీనియర్‌ హీరో శ్రీకాంత్‌, ‘కిక్’ శ్యామ్‌ నటించారు. శరత్‌కుమార్‌, జయసుధ, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగులో ‘వారసుడు’ పేరుతో జనవరి 14 నుంచి ఈ సినిమా సందడి చేయనుంది.

మరోవైపు రేపు బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి కూడా విడుదల కానుంది. ఈ సినిమాకు కూడా తమన్ మ్యూజిక్ అందించారు. ఈ సంక్రాంతి పండుగకు రెండు బ్లాక్ బస్టర్ సినిమాలతో వస్తున్న తమన్ ఆ సినిమాల గురించి మాట్లాడుతూ.. ‘‘మాకు గత రెండు నెలలు పిండి ఆరేసినట్లు ఉంది (నవ్వుతూ). బాలకృష్ణ పక్కా కల్ట్‌ సినిమా ఓవైపు.. ఎమోషన్స్‌తో నిండిన విజయ్‌ పక్కా ఫ్యామిలీ చిత్రం మరోవైపు. రెండూ విజయవంతమవుతాయని నమ్మకంగా ఉన్నాం. నా నుంచి ఇలాంటి రెండు పెద్ద సినిమాలు ఒకేసారి సంక్రాంతి బరిలో నిలవడం ఇదే తొలిసారి’’. అన్నారు.