Agent First Review : ‘ఏజెంట్ ‘ మొట్టమొదటి రివ్యూ.. టాలీవుడ్ కి ఇది ‘పఠాన్’ లాంటి సినిమా

- Advertisement -

Agent First Review : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘ఏజెంట్’ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.ఎందుకంటే కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు అఖిల్ కి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు.ఆయన చివరి చిత్రం గీత ఆర్ట్స్ నిర్మించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సూపర్ హిట్ అయ్యినప్పటికీ అది అఖిల్ రేంజ్ ని పెంచే రేంజ్ హిట్ అయితే కాదు.అందుకే ఈసారి హిట్ కొడితే స్టార్ హీరోల రికార్డ్స్ ని కొట్టాలి అనే కసితో ఆయన ‘ఏజెంట్’ సినిమా కోసం కష్టపడ్డాడు.

Agent First Review
Agent First Review

అతను ఎంత కష్టపడ్డాడో మొన్న విడుదలైన ట్రైలర్ ని చూసి చెప్పేయొచ్చు.మరి ఆయన కష్టానికి తగిన ఫలితం వస్తుందా లేదా అనేది తెలియాలంటే ఈ నెల 28 వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ ని ఇటీవలే డైరెక్టర్ సురేందర్ రెడ్డి నాగార్జున తో పాటుగా కొంతమంది సినీ ప్రముఖులకు ప్రైవేట్ స్క్రీనింగ్ ద్వారా చూశారట.

Akhil Akkineni Agent Movie

చూసిన ప్రతీ ఒక్కరు ఒక అద్భుతమైన యాక్షన్ సినిమాని చూసిన అనుభూతి కలిగింది అంటూ అఖిల్ కి మరియు డైరెక్టర్ సురేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియచేశారట.టాలీవుడ్ కి ఈ చిత్రం మరో పఠాన్ లాగ నిలిచిపోతుందని,ఆ సినిమా బాలీవుడ్ లో ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో టాలీవుడ్ లో ‘ఏజెంట్’ కూడా అదే రేంజ్ సెన్సేషన్ సృష్టిస్తుందని చెప్పారట.

- Advertisement -
Agent Movie

అఖిల్ కూడా తన నటనని చాలా మెరుగుపర్చుకున్నాడని, ఈ సినిమా తర్వాత ఆయన స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టడం ఖాయమని అంటున్నారు.డైరెక్టర్ సురేందర్ రెడ్డి తనలోని టాలెంట్ ని మరోసారి అందరికీ పరిచయం చేసాడని, సమ్మర్ లో సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న మూవీ లవర్స్ కి ఏజెంట్ చిత్రం ఒక పండుగ లాగా ఉంటుందని తెలుస్తుంది. చూడాలిమరి ఈ చిత్రం అంచనాలను అందుకుంటుందా లేదా అనేది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here