Akhil Akkineni: హీరోయిన్ తో మందు తాగి అక్కినేని అఖిల్ అసభ్య ప్రవర్తన..?షూటింగ్ మధ్యలోనే వాక్ అవుట్!

- Advertisement -

Akhil Akkineni: ఎల్లప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా లో అలజడి సృష్టించే వ్యక్తి ఉమర్ సందు.ఇతను వేసే ట్వీట్స్ ఇప్పుడు నేషనల్ మీడియా మొత్తం వైరల్ గా మారుతున్నాయి.అతను వేసేవి అన్ని గాసిప్స్, పచ్చి అబద్దాలు అని తెలిసి కూడా అతని ట్వీట్స్ కి అంత రీచ్ ఎలా వస్తుందో విశ్లేషకులకు సైతం అంతు చిక్కట్లేదు.రోజుకో సెలబ్రిటీ గురించి పుకార్లు పుట్టించే ఉమర్ సందు కన్ను ఇప్పుడు అక్కినేని అఖిల్ మీద పడింది.

Akhil Akkineni
Akhil Akkineni

ఇక అసలు విషయానికి అఖిల్ మరియు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఏజెంట్’ అనే చిత్రం ఈ నెల 28 వ తారీఖున విడుదల కాబోతుంది.ఈ సినిమాకి సంభందించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా నిన్ననే కాకినాడ లో జరిగింది.ట్రైలర్ కూడా అభిమానులను మరియు ప్రేక్షకులను ఆకట్టుకుంది, అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఒక ఐటెం సాంగ్ షూటింగ్ బ్యాలన్స్ ఉంది.

Akhil

ఈ ఐటెం సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతుల్లా అఖిల్ తో కలిసి చిందులు వేయనుంది.గత రెండు రోజులుగా ఈ సాంగ్ షూటింగ్ జరుగుతుండగా,మొన్న అఖిల్ షూటింగ్ స్పాట్ కి తాగేసి వచ్చాడని, ఊర్వశి రౌతుల్లా తో అసభ్యంగా ప్రవర్తించాడని, అందువల్ల ఆమె షూటింగ్ మధ్యలోనే లేచి వెళ్లిపోయిందని, ఆ తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఆమెని బ్రతిమిలాడి లొకేషన్ కి తీసుకొచ్చాడని ఉమర్ సందు ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేసాడు.

- Advertisement -

ఈ ట్వీట్ క్రింద అక్కినేని అభిమానులు ఉమర్ సందు ని అడ్డమైన బూతులు తిట్టడం ప్రారంభించారు.ఇన్నేళ్ల నుండి ఇండస్ట్రీ లో ఉంటున్న అఖిల్ వ్యక్తిగతం పై చిన్న మచ్చ కూడా లేదని, అలాంటి వాడి పైన ఇలాంటి రూమర్స్ ప్రచారం చేస్తే నీ అడ్రస్ కనుక్కొని మరీ వచ్చి కొడుతాము అంటూ ఉమర్ సందు కి వార్నింగ్ ఇచ్చారు.ఇలా ప్రతీ ఒక్కరు ఉమర్ సందు ని ప్రతీ రోజు తిడుతూనే ఉంటారు కానీ, అతని పై ఇప్పటి వరకు ఎవ్వరూ యాక్షన్ తీసుకోకపోవడం విశేషం.

Akkineni
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here