Adipurush Teaser Review : గ్రాఫిక్స్ తో అదరగొట్టిన ‘ఆదిపురుష్‌’ టీజర్ .. మరో విజువల్ వండర్..

- Advertisement -

Adipurush Teaser Review : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలను చేస్తూ బిజీ అయ్యాడు.. ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో తెరకేకుతున్న ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్నాడు..ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్‌లు నటించిన సంగతి తెలిసిందే.. విజువల్ వండర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Adipurush Teaser Review
Adipurush Teaser Review

ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.. ఇక ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే.. కిందరు విమర్శలు చేసినా కూడా మరికొంతమంది అదుర్స్ అంటూ ప్రశంసలు కురిపించారు..నాసిరకమైన వీఎఫ్ఎక్స్, రాముడు, ఆంజనేయుడు, రావణుడ్ని చూపించిన తీరు కూడా అభ్యంతరకరంగా మారింది. దీంతో సినిమా టీం అంతా కూడా రిపేర్లు చేసేందుకు రెడీ అయింది.

గత ఏడాది రావాల్సిన ఈ సినిమాను పలు మార్లు వాయిదాలు వేస్తూనే వస్తున్నారు…వాటికి చెక్ పెడుతూ చిత్ర యూనిట్ తాజాగా ఒక టీజర్ ను విడుదల చేసింది.. అది విడుదలైన కొద్ది నిముషాలకే ఓ రేంజులో దూసుకుపోతుంది.. ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది..

- Advertisement -
prabhas adhipursh

ఇక ఇప్పుడు జూన్ 16న రాబోతోన్నామని ఇప్పుడు ఓ డేట్‌ను అయితే లాక్ చేసి పెట్టుకున్నారు. జూన్‌లో ఆదిపురుష్‌ సందడి చేయబోతోన్నాడని తెలిసిందే. అయితే ఈ సినిమాను ఓ మూడ్రోజుల ముందే అంతర్జాతీయ వేదికపై స్క్రీనింగ్ చేయబోతోన్నారని ప్రకటించారు. ట్రైబెకా ఫెస్టివల్‌లో ఈ సినిమాను స్పెషల్‌గా ప్రదర్శించబోతోన్నారట.

జూన్ 13న ఈ సినిమాను అక్కడ స్క్రీనింగ్ చేయబోతోన్నామని ఓం రౌత్ ట్వీట్ వేశాడు… ఇది ఇలా ఉండగా తాజాగా విడుదలైన టీజర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది..అదిరిపోయే విఎఫెక్స్ తో సన్నివేశాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి.. దీంతో సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.. ఒక్కో సీన్ రామాయణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.. మొత్తానికి ఈ వీడియో ప్రేక్షకులల్లో బజ్ ను తీసుకొచ్చింది.. సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..

adhipursh new teaser

ఇకపోతే ఓం రౌత్ చేసిన రిపేర్లు జనాలను ఆకట్టుకుంటాయా? లేదా? అన్నది చూడాలి. అసలే వీఎఫ్‌ఎక్స్, ఆ విజువల్స్, ఆ గెటప్స్ అన్నీ కూడా ట్రోలింగ్‌కు గురవుతూనే ఉన్నాయి. రిపేర్లు చేయడానికే దాదాపు వంద కోట్లు అధనంగా ఖర్చు చేసినట్టుగా టాక్ వచ్చింది. మరి ఈ సారి వచ్చే అవుట్ పుట్ ఎలా ఉంటుందనేది చూడాలి.

ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 13 భాషల్లో విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడు రోజుల ముందే వేరే దేశంలో ఈ సినిమాను ప్రదర్శించబోతోన్నారు. ఇండియాలో అయితే అనుకున్న టైం అంటే.. జూన్ 16న విడుదల చేయబోతోన్నారు.. మరి ఈ సినిమా అయిన డార్లింగ్ కు మంచి హిట్ టాక్ ను అందిస్తుందేమో చూడాలి.. ఆ టీజర్ ఎలా ఉందో మీరు ఒక లుక్ వేసుకోండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here