Chiranjeevi : రీ ఎంట్రీ తర్వాత ఏ హీరోకి సాధ్యం కానీ మరో చెత్త రికార్డుని నెలకొల్పిన చిరంజీవి..!

- Advertisement -

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి రేంజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన నాలుగు దశాబ్దాలుగా నెంబర్ స్థానం లో కొనసాగాడు. మధ్యలో ‘ప్రజా రాజ్యం’ పార్టీ తో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మెగాస్టార్ సుమారుగా పదేళ్లు సినిమాలకు దూరం అయ్యాడు. ఆ తర్వాత ‘ఖైదీ నెంబర్ 150 ‘ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మూడు సార్లు వంద కోట్ల రూపాయిల షేర్ సినిమాలను కొల్లగొట్టి చరిత్ర సృష్టించాడు.

Chiranjeevi
Chiranjeevi

మధ్యలో మూడు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా తగిలాయి కానీ అవేమి మెగాస్టార్ మార్కెట్ కి ఇసుమంత నష్టం కూడా తెచ్చిపెట్టలేదు. అయితే రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు టీవీ టెలికాస్ట్ లో చాలా పూర్ రెస్పాన్స్ వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఉగ్ర రూపం చూపించే మెగాస్టార్ కి ఎందుకు టీవీ టెలికాస్ట్ లో ఇంత పూర్ రెస్పాన్స్ వస్తుంది అనేది ప్రస్తుతానికి అంతు చిక్కని ప్రశ్న.

Mega star Chiranjeevi

ఈ ఏడాది ఆయన హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. సుమారుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. లేటెస్ట్ గానే జెమినీ టీవీ లో టెలికాస్ట్ అయిన ఈ సినిమాకి మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ కేవలం 5 టీఆర్ఫీ రేటింగ్స్ మాత్రమే ఈ చిత్రానికి వచ్చాయి . ఇది చాలా తక్కువ అని చెప్పాలి. కేవలం వాల్తేరు వీరయ్య చిత్రానికి మాత్రమే కాదు రీ ఎంట్రీ తర్వాత ఆయన చేసిన ‘ఖైదీ నెంబర్ 150 ‘, ‘సై రా నరసింహా రెడ్డి’,’ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ చిత్రాలకు కూడా 10 లోపే టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. ఈ ట్రాక్ రికార్డు చూసి మెగాస్టార్ సినిమాని ఆడియన్స్ బుల్లితెర మీద చూడడం మానేశారా ? అనే సందేహం విశ్లేషకుల్లో కలిగింది.

- Advertisement -

మెగాస్టార్ సినిమాలకు మంచి టీఆర్ఫీ రేటింగ్స్ రాకపోవడానికి కారణాలు, ఆయన రీ ఎంట్రీ తర్వాత చేసినవన్నీ యావరేజి కంటెంట్ సినిమాలు అవ్వడమే అని అంటున్నారు విశ్లేషకులు. బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా తో మెగాస్టార్ వసూళ్లు రప్పించి ఉండొచ్చేమో కానీ, టీవీ టెలికాస్ట్ అప్పుడు మాత్రం కచ్చితంగా చాలా లిమిటెడ్ గా ఉంటుందని అంటున్నారు. మెగాస్టార్ ఒక సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమాని ఇస్తే కచ్చితంగా టీవీ టెలికాస్ట్ లో కూడా ఆయన రికార్డ్స్ సృష్టిస్తాడు అంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు, చూడాలి మరి మెగాస్టార్ చిరంజీవి కి అలాంటి కంటెంట్ ఇచ్చే డైరెక్టర్ ఎవరు అనేది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here