యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ మొదటి నుండి ఈ చిత్రానికి భారీ హైప్ ఉండడం వల్ల ఈ సినిమాకి ఓపెనింగ్స్ దద్దరిల్లిపోయాయి. కేవలం మూడు రోజుల్లోనే 340 కోట్ల రూపాయిల వసూళ్లను నిర్మాతలు అధికారికంగా మీడియా కి తెలిపారు. అయితే నాల్గవ రోజు నుండి మాత్రం ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి.

కనీస స్థాయి వసూళ్లు కూడా రాక డిజాస్టర్ ఫ్లాప్ అయ్యే దిశగా అడుగులు వేస్తుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 250 కోట్ల రూపాయలకు జరిగింది. కానీ షేర్ పరంగా చూస్తే ఇప్పటి వరకు ఈ సినిమా 150 కోట్ల రూపాయిలను మాత్రమే అందుకుంది, మిగతా 100 కోట్ల రూపాయిల షేర్ రాబట్టే అవకాశమే లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇది ఇలా ఈ చిత్ర రచయిత మనోజ్ ముంతషీర్ హనుమంతుడు గురించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘అసలు హనుమంతుడు దేవుడే కాదు. ఆయనలో రాముడి పై ఉన్న అపారమైన భక్తి కారణంగా ఆయనని దేవుడిగా చూడాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు. అసలే ఆదిపురుష్ మూవీ టీం పై నార్త్ ఇండియన్స్ బయట కనిపిస్తే కొట్టేస్తాము అనే రేంజ్ లో మూవీ టీం పై కోపం తో ఉన్నారు.

ఈ సమయం లో ఇలాంటి కామెంట్స్ చేస్తే వివాదం మరింత ముదరడమే తప్ప మరో ఉపయోగం లేదని అంటున్నారు. హిందూ సంఘాలు నిరసనలు తెలుపుతూ పలు చోట్ల ఈ సినిమా షోస్ ని నిలిపివేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ కి ఇంకెంత రచ్చ చేస్తారో అని ప్రభాస్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. మా హీరో విలువైన సమయాన్ని వృధా చెయ్యడమే కాకుండా, నెగటివిటీ ని ఒక రేంజ్ లో రప్పించాడు అంటూ డైరెక్టర్ ఓం రౌత్ పై విరుచుకుపడుతున్నారు ఫ్యాన్స్.