‘లెజెండ్’ చిత్రం లో నటించిన ఈ చిన్నారి.. ఇప్పుడు ఎక్కడుందో ఏమి చేస్తుందో చూస్తే నోరెళ్లబెడుతారు!

- Advertisement -

నందమూరి బాలకృష్ణ కెరీర్ ని మలుపుతిప్పిన సినిమాలలో ఒకటి ‘లెజెండ్’. సింహా వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య మరియు బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై సెన్సేషనల్ హిట్ గా నిల్చింది. ఆరోజుల్లోనే ఈ చిత్రం సుమారుగా 45 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రం లోని డైలాగ్స్ మొత్తం అప్పట్లో ఎంత పాపులర్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే.

లెజెండ్
లెజెండ్

ఎలివేషన్ సన్నివేశాలు మరియు ఫైట్ సన్నివేశాలు బాలయ్య బాబు కెరీర్ లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ద్వారానే ప్రముఖ సీనియర్ హీరో జగపతి బాబు విలన్ గా తొలిసారి పరిచయం అయ్యాడు. ఈ చిత్రం లో ఆయన పాత్ర బాలయ్య తో సరిసమానంగా నువ్వా నేనా అనే రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమా పెద్ద హిట్టైన తర్వాత జగపతి బాబు రేంజ్ మారిపోయింది. వరుసగా చేతినిండా సినిమాలతో విలన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా పాన్ ఇండియా లెవెల్ లో మంచి డిమాండ్ ని సంపాదించుకున్నాడు.

Balakrishna

ఇక ఈ చిత్రం సెకండ్ హాఫ్ లో బాలయ్య బాబు ఆడపిల్ల గొప్పతనం గురించి డైలాగ్స్ చెప్పే ముందు, ఒక చిన్న పాపతో జరిపిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా లో మీమ్ గా ఎంత ఫేమస్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. సరదా సంభాషణల్లో మన నెటిజెన్స్ ఈ మీమ్ ని ఉపయోగిస్తూనే ఉంటారు. చిన్నారి పాప మేడలో చైన్ వేస్తూ ‘ఏది ఒక్కసారి మామయ్యా అని పిలువు అమ్మా’ అంటే ఆ పాప ముద్దుగా ‘మావయ్యా’ అని పిలుస్తుంది, ఈ పాప ఎవరు?, మళ్ళీ ఎలాంటి సినిమాలో కూడా కనిపించలేదే!,ఇప్పుడు ఎక్కడ ఉంది ఏమి చేస్తుంది అని నెటిజెన్స్ గూగుల్ లో చాలా వరకు వెతికారు కానీ ఎక్కడా దొరకలేదు.

- Advertisement -
Legend movie child

అయితే మాకు అందిన సమాచారం ప్రకారం ఈ అమ్మాయి పేరు చైత్ర అట, ఈమె విజయవాడ కి చెందిన అమ్మాయి. బోయపాటి శ్రీను ప్రత్యేకంగా ఈ షాట్ కోసం కొంతమంది చిన్నారులను ఆడిషన్ చేసి తీసుకున్నారట. 300 మంది చిన్నారులు ఆడిషన్స్ లో పాల్గొనగా, కేవలం ఈ అమ్మాయి ఒక్కటే సెలెక్ట్ అయ్యిందట. చిన్న సన్నివేశం లో నటించినప్పటికీ, ఈ అమ్మాయికి మామూలు పాపులారిటీ రాలేదు. ఈ అమ్మాయి రీసెంట్ గానే ఇంటర్ పూర్తి చేసిందట, త్వరలోనే బీటెక్ లో కూడా చేరబోతున్నట్టు సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here