Actress Samantha : ఒక్క పోస్టుతో రూమర్స్ కు చెక్ పెట్టిన సమంత.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

- Advertisement -

Actress Samantha : టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సమంత మధ్యతరగతిలో పుట్టి సాధారణ అమ్మాయిలాగే కలలు కని ఆ కలల కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంది. ఏం మాయ చేశావే మూవీతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసి తెలుగు ప్రేక్షకుల మదిని దోచేసింది. ఇక అప్పట్నుంచి వెనక్కి తిరిగిచూసుకోలేదు. వరుస అవకాశాలతో హిట్, ఫ్లాప్ తేడా లేకుండా కమర్షియల్, కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఈ బ్యూటీ రేంజ్ పాన్ ఇండియా వరకు వెళ్లింది. ఇక సామ్ దశ తిరిగింది అనుకున్న టైంలో ఈ బ్యూటీ తన అనారోగ్య సమస్య గురించి చెప్పి షాక్ ఇచ్చింది. 

Actress Samantha
Actress Samantha

సమంత తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ చాలా ఆందోళన పడుతున్నారు. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సామ్ సోషల్ మీడియాలో అసలు కనిపించకుండా పోవడంతో అసలు సామ్ ఎలా ఉందోనన్న బెంగ పట్టుకుంది. అయితే తన ఆరోగ్యం గురించి సమంత అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూ తన అభిమానులతో టచ్ లో ఉంది సమంత . అయితే సామ్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని.. తను బాలీవుడ్ ప్రాజెక్టుల నుంచి తప్పుకుందంటూ కొన్ని రోజులుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

samantha
samantha

సమంత తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఒక్క పోస్టుతో చెక్ పెట్టింది. తన అభిమానులకు ఆనందాన్నిచ్చే వార్త చెప్పింది. తాను పనిలో బిజీ అయినట్టు సూచించే ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘శాకుంతలం’. ప్రస్తుతం ఆ సినిమా డబ్బింగ్‌ పనుల్లో సామ్‌ నిమగ్నమైంది. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘జీవితం ఎలా ఉన్నా.. మనం బాధలో ఉన్నా, నష్టపోయినా వాటన్నింటికీ పరిష్కారం కళే. కళ మాత్రమే అన్ని సమస్యలకు నివారణ’’ అన్న కొటేషన్‌ను దానికి జతచేసింది.

- Advertisement -

ఆ ఫొటోలో ‘శాకుంతలం’లోని సమంత లుక్‌ కనిపించింది. అది చూసి ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. ‘క్వీన్ ఈజ్‌ బ్యాక్‌’, ‘ఇలా చూడండి సమంత ఎంత సంతోషంగా ఉందో’ అని నెట్టింట కామెంట్స్‌ చేస్తున్నారు. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో శకుంతలగా సమంత.. దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ నటించారు. మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్‌, మధుబాల, గౌతమి కీలక పాత్రలు పోషించారు. యువరాజు భరతుడిగా అల్లు అర్జున్‌ కుమార్తె అల్లు అర్హ అలరించనుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here