Actress Prema తమ్ముడు పెద్ద స్టార్ క్రికెటర్ అనే విషయం ఎవరికైనా తెలుసా..!

- Advertisement -

Actress Prema ఆరోజుల్లో కోడి రామకృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన ‘దేవి’ అనే చిత్రం ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇందులో ప్రముఖ హీరోయిన్ ప్రేమ టైటిల్ పాత్రని పోషించింది.ఆ రోజుల్లో ఈ సినిమా ఒక స్టార్ హీరో చిత్రం హిట్ అయితే ఎలాంటి వసూళ్లను రాబడుతుందో, అలాంటి వసూళ్లను రాబట్టింది.ఇక ఈ చిత్రం తర్వాత ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

Actress Prema

తెలుగు లో ఆమె నటించింది తక్కువ సినిమాలే అయినా, ఎప్పటికీ మర్చిపోలేని పాత్రలు పోషించింది.2017 వ సంవత్సరం వరకు యాక్టీవ్ గా సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఈమె, కొంతకాలం విరామం ఇచ్చి మళ్ళీ ‘వివాహ బహుమతి’ అనే చిత్రం ద్వారా 2022 వ సంవత్సరం లో రీ ఎంట్రీ ఇచ్చింది.అయితే ఇటీవలే ఈమె పలు ఇంటర్వ్యూస్ ఇచ్చింది, ఈ ఇంటర్వ్యూస్ లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.

Actress Prema Photos

ఆమె మాట్లాడుతూ ‘నా మొదటి సినిమానే కన్నడలో శివ రాజ్ కుమార్ లాంటి సూపర్ స్టార్ నటించిన ‘సవ్యసాచి’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు మా తండ్రి మనకి ఎందుకు ఈ సినిమా రంగం, అవసరమా అని తిట్టేవారు, ఆ తర్వాత ఆయన నాలోని టాలెంట్ గుర్తించి ప్రోత్సహించారు’ అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -
Actress Prema Stills

అలా సినీ రంగం లో దూసుకొచ్చిన ప్రేమ తమ్ముడు అయ్యప్ప ఒక స్టార్ క్రికెటర్, ప్రస్తుతం ఈయన కెనరా బ్యాంకు లో ఉన్నత ఉద్యోగం చేస్తున్నాడు. ఇక ప్రేమ చెల్లి పెళ్లి చేసుకొని దుబాయి లో స్థిరపడగా, ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారని, తను హౌస్ వైఫ్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ప్రేమ కూడా జీవన్ అప్పచ్చు అనే అతనిని 2006 వ సంవత్సరం లో పెళ్ళాడి, 2016 వ సంవత్సరం లో విడాకులు తీసుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here