Guess The Actress : ఆదిత్య 369 హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే ఆశ్చర్యపోతారు

- Advertisement -

Guess The Actress : నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఒక మైలు రాయిగా నిలిచిపోయిన చిత్రం ఆదిత్య 369.. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఆ రోజుల్లో సింగీతం శ్రీనివాస రావు తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ అవ్వడమే కాకుండా, తెలుగు సినిమా స్థాయిని పెంచింది .ఇప్పటికీ ఈ సినిమా టీవీ లో వస్తే కదలకుండా కూర్చొని చూస్తాము, అది ఈ చిత్రానికి ఉన్న స్పెషాలిటీ. ఇక ఈ సినిమాలో పని చేసిన నటీనటులతో హీరోయిన్ మోహిని గురించి మాట్లాడుకోవాలి.

Guess The Actress
Guess The Actress

ఈమెకి ఇది రెండవ సినిమా, అంతకు ముందు తమిళం లో ఈమె ‘ఈరామానా రోజావే’ అనే చిత్రం లో నటించింది.ఆ చిత్రం పెద్దగా సక్సెస్ సాధించకపోయినా తెలుగు లో ఈమె చేసిన రెండవ చిత్రం ‘ఆదిత్య 369 ‘ మాత్రం ఎంతో స్పెషల్ గా నిలిచింది.ఇక ఆ తర్వాత ఈమె ఎక్కువ శాతం తమిళ సినిమాల్లోనే హీరోయిన్ గా నటించింది.

Actress Mohini

ఈమె తెలుగు లో చేసిన మరో గుర్తుండిపోయ్యే పాత్ర మెగాస్టార్ చిరంజీవి గా నటించిన ‘హిట్లర్’ అనే చిత్రం. ఇందులో ఈమె చిరంజీవి పెద్ద చెల్లెలు గా నటించి మంచి గుర్తింపుని దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈమె తెలుగు సినిమాల్లో కనిపించలేదు, ఎన్నో అవకాశాలు వచ్చాయి కానీ, ఆమె ఎక్కువగా తమిళం మరియు మలయాళం సినిమాల్లో నటించడానికే మొగ్గు చూపించింది.

- Advertisement -
Actress Mohini Photos

ఆమె చివరి చిత్రం కూడా ‘మలయాళం’ సినిమా అవ్వడం విశేషం. సురేష్ గోపి హీరో గా నటించిన ‘కలెక్టర్’ అనే చిత్రం లో నటించింది. ఈ సినిమా తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కేవలం సినిమాల్లోనే కాదు, సీరియల్స్ లో కూడా ఈమె బాగా రాణించింది, కానీ బుల్లితెర మీద కూడా ఈమె 2011 వ సంవత్సరం నుండి కనిపించడం లేదు. ఈమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఒకటి క్రింద అందిస్తున్నాము చూడండి.

Actress Mohini Images
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here