Actress Kasthuri : నాగార్జున నటించిన అన్నమయ్య సినిమా ద్వారా హీరోయిన్గా పరిచమైన Actress Kasthuri ఆ సినిమా తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. ప్రస్తుతం ఈమె ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తున్నారు. తనపనేంటో తాను చేసుకుంటూ వస్తుంది.
ఎవరితో మాట పడదు..సినిమాలు, సీరియల్స్‌లో పద్ధతిగా చీరకట్టులో కనిపించే కస్తూరి.. బయట మాత్రం కాస్త మోడరన్‌గా ఉంటారు. మోడరన్ దుస్తుల్లో దిగిన ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియాలో పెడుతుంటారు. ఇవి చూసిన కొందరు నెటిజన్లు ఆమెపై అభ్యంతరకరంగా కామెంట్లు పెడుతుంటారు. అలాంటి వాళ్లకు కస్తూరి వెంటనే తిరిగి కౌంటర్స్ ఇస్తారు.. ఓ నెటిజన్ కు గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది..
తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్లో మోషన్ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో కస్తూరి స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నారు. స్విమ్‌సూట్‌లో ఉన్న కస్తూరి.. తడిసిన జుట్టును వెనక్కి విసిరారు.దాన్ని స్లో మోషన్‌లో వీడియో తీసి పెట్టారు. స్వాగతించే నీటి కౌగిలిలో నన్ను నేను మైమరిచిపోతున్నాను.. స్వర్గం. 2023లో నాకు మొదటిరోజు అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు క్యాప్షన్ పెట్టారు కస్తూరి..
ఆ వీడియోను చూసిన ఒక నెటిజన్ ఈ వయసులో నీకు ఇలాంటి పనులు అవసరమా? అని తమిళంలో కామెంట్ చేశాడు. దీనికి కస్తూరి వెంటనే సమాధానం ఇచ్చేశారు. అవసరమే. ఈ వయసులో నీకు అవసరం లేదు. పోయి..వెళ్లి రామాయణం చదువుకో అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కస్తూరి సమాధానం చూసి ఆమె అభిమానులు ఏం ఇచ్చారు మేడమ్ అంటూ అభినందించారు. ఒకరి వయస్సు గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని కొందరు చేస్తున్నారు.. మొత్తానికి ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..