Shobha Shetty : పెళ్లి పీటలు ఎక్కబోతున్న కార్తీకదీపం మోనిత.. వరుడు ఎవరంటే..?

- Advertisement -

కార్తీక దీపం సీరియల్ నటి Shobha Shetty అలియాస్ మోనిత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆ సీరియల్ ప్రేక్షకులను ఎంతగా అల్లరించిందో మోనిత పాత్ర కూడా అందరికి అలా గుర్తుండి పోయింది. వంటలక్క కన్నా మోనిత బాగా పాపులర్ అయ్యింది.. కార్తీకదీపం సీరియల్ ముగియడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.. అయితే త్వరలో కార్తీకదీపం సీజన్2 వచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Shobha Shetty
Shobha Shetty

అయితే శోభా శెట్టి తనకు పెళ్లి చూపులంటూ ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈరోజు నాకు పెళ్లిచూపులు అంటూ వీడియోలో శోభా శెట్టి తెగ సిగ్గుపడి పోయారు. పెళ్లిచూపులు అనే వర్డ్ చెప్పడానికి సిగ్గు పడుతున్నానని ఆమె కామెంట్లు చేశారు. ఈరోజు నా బర్త్ డే అని శోభా చెప్పారు. ఈరోజే పెళ్లి చూపులు కావడంతో పక్కా ట్రెడిషనల్ గా రెడీ అవుతున్నానని ఆమె తెలిపారు.

Shobha Shetty engangement

అలాగే ఆమె ప్రతి పుట్టినరోజున ఇంట్లో సత్యనారాయణ వ్రతం కూడా జరుగుతోందని చెప్పుకొచ్చారు. తొలిసారి పట్టు శారీ ధరిస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు. నాకు గాజులు అంటే చాలా చాలా ఇష్టమని శోభా శెట్టి వెల్లడించారు. శారీ లుక్ లో శోభా శెట్టి మెరిసిపోయారు. నా లుక్ నాకు ఎంతగానో నచ్చిందని ఆమె తెలిపారు. అనుకున్న నగలు అంతగా సెట్ కాలేదని శోభా శెట్టి వెల్లడించారు.

- Advertisement -

తర్వాత వీడియోలో మరిన్ని వివరాలను ఆమె చెప్పుకొచ్చారు. మరో వీడియోను త్వరగా పోస్ట్ చెయ్యాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.. ప్రస్తుతం ఇతర సీరియళ్లలో కూడా ఆఫర్లు వస్తున్నాయి. కార్తీకదీపం సక్సెస్ తో ఆమె రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిందని సమాచారం. ఈ వీడియో గురువారం రోజున రిలీజ్ కానుందని టాక్..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here