నోయల్‌పై ఎస్తర్ కామెంట్స్.. అతడి నిజస్వరూపం అప్పుడే తెలిసింది.. అలా వాడుకున్నాడంటూ..!

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో అప్పుడే ప్రేమ పుట్టడం.. అంతలోనే బ్రేకప్ అవ్వడం సహజం. కొన్నిసార్లు ఆ ప్రేమ పెళ్లిపీటల దాకా వెళ్లి.. కొన్నేళ్ల తర్వాత మళ్లీ విడాకుల వరకు వచ్చేస్తుంది. చాలా వరకు జంటలు ఇలా విడాకులతో ఎండ్ అయినవే. ముఖ్యంగా ఒకే ఇండస్ట్రీ నుంచి పెళ్లాడితే ఇక అంతే సంగతి. ఇలాంటి జంటల రిలేషన్ దాదాపు ఫెయిల్ అయినవే ఎక్కువగా ఉన్నాయి. అలాంటి జంటల్లో ఓ జంట టాలీవుడ్ ర్యాపర్, సింగర్ నోయెల్ సేన్.. హీరోయిన్ ఎస్తర్.

ఈ ఇద్దరు తమ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత చాలా కాలం వీరి ప్రేమాయణం సీక్రెట్ గానే సాగింది. ఆ విషయం లీక్ అయిన వెంటనే ఇద్దరు మూడు ముళ్ల బంధంలో అడుగు పెట్టారు. 2019లో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెద్దల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది. కానీ పెళ్లైన ఆరు నెలలకే ఇద్దరూ విడిపోయారు. కానీ ఈ విషయం ప్రపంచానికి తెలియనివ్వలేదు. కొన్నేళ్ల క్రితం న్యాయబద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని అందరికీ చెప్పి షాక్ ఇచ్చారు.

- Advertisement -

నోయల్‌తో విడాకులు తీసుకున్న తర్వాత టాలీవుడ్ లో పెద్దగా కనిపించలేదు. కానీ కన్నడ సినిమాల్లో మాత్రం వరుసగా మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఓ సినిమా కోసం కొద్దిరోజుల క్రితం ఎస్తర్ హైదరాబాద్ వచ్చింది. తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విడాకులపై, మాజీ భర్త నోయెల్ పై ఎస్తర్ నోరు విప్పింది.

‘పెళ్లైన 16 రోజులకే నోయెల్ నిజస్వరూపం తెలుసుకున్నా. అందుకే అతడి నుంచి విడిపోవాలని డిసైడ్ అయిపోయా. అందుకే అంత త్వరగా విడాకులు తీసేసుకున్నా. నాతో విడిపోయాక నోయెల్ నాపై చెడుగా ప్రచారం చేశాడు. బిగ్ బాస్ షోలో తనపై సింపతీ వచ్చేలా మా విడాకుల ఇష్యూను వాడుకున్నాడు. దీంతో ప్రేక్షకుల్లో సానుభూతి పొందాలని ప్రయత్నాలు చేశాడు. అప్పుడే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని నాకు అనిపించింది. కానీ, దీనిపై నాకు మాట్లాడాలని అనిపించలేదు. నోయల్ నా గురించి బ్యాడ్‌గా చిత్రీకరించడంతో అందరు నాదే తప్పు అనుకున్నారు. దీంతో నాపై ట్రోల్స్ చేశారు. ఓ వ్యక్తి అయితే హైదరాబాద్ వస్తే యాసిడ్ పోస్తానని బెదిరించాడు. అసలు మా మధ్య ఏం జరిగిందో నాకే తెలుసు. కానీ, ఇన్ని రోజులు ఉన్నా. అదే నా తప్పు’ అంటూ ఎస్తర్ చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here