హీరోయిన్ స్నానం చేసే వీడియో చూసి భయపడ్డాను : దియా మీర్జాటీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలోని తన హోటల్ రూమ్ వీడియో లీక్ అవ్వడంపై తీవ్రంగా మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ విషయంపై విరాట్ భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ కూడా గట్టిగా ఫైర్ అయింది. సెలబ్రిటీలు అయినా తమకంటూ ప్రైవసీ ఉండాలని.. తమ ప్రైవైసీకి భంగం కలిగించడం మంచి విషయం కాదని విరుష్క జంట సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిపై చాలా మంది సినీ, క్రికెట్ ప్రముఖులు కూడా రియాక్ట్ అయ్యారు. హోటల్ సిబ్బందిపై వారు కూడా ఫైర్ అయ్యారు.

తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ తార దియా మీర్జా స్పందించింది. తాను హోటల్ కు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పేసింది. పదేళ్ల క్రితం కొందరు హీరోయిన్లు స్నానం చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో తాను చాలా షాక్ అయ్యాయనని దియా చెప్పింది. అప్పటి నుంచి బయట హోటళ్లలో ఉండాల్సి వస్తే తాను చాలా జాగ్రత్తగా ఉంటానని తెలిపింది. తాను హోటల్ కు వెళ్లిన తర్వాత మాత్రమే రూమ్ బుక్ చేసుకుంటానని.. ఆ గదిలో రహస్య కెమెరాలు ఉన్నాయో లేదో క్లియర్ గా వెతికిన తర్వాతే చెక్ ఇన్ అవుతానని చెప్పుకొచ్చిందీ ఈ బాలీవుడ్ అమ్మడు.

2001లో రెహనా హై తెరే దిల్ మే అనే రొమాంటిక్ డ్రామాతో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది దియా మీర్జా. నటి కాకముందు ఆమె మోడల్ గా విజయవంతమైన కెరీర్ ను సాగించింది. మిస్ ఆసియా పసిఫిక్ టైటిల్ ను కూడా గెలుచుకుంది. లగే రహో మున్నా భాయ్, సంజు, తప్పడ్ వంటి మూవీస్ లో నటించింది. తప్పడ్ డైరెక్టర్ అనుభవ్ సిన్హా తెరకెక్కిస్తున్న భీడ్ మూవీలో దియా ప్రస్తుతం నటిస్తోంది.