Actor Prabhas : బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో జనాల్లొ విపరీతమైన క్రేజ్ ను అందుకుంది.. ముఖ్యంగా ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్ జనాల్లొ మరింత క్రేజ్ ను అందించింది..అందుకే ఆఁహాఁ టీమ్ ఆ ఎపిసోడ్ ను ప్రత్యేకంగా రెండు గా మార్చింది.. ఏడో ఎపిసోడ్ లో ప్రభాస్ వచ్చి అలరించాడు. ఈ ఎపిసోడ్ కి భారీ స్పందన వచ్చింది. ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు దేశవ్యాప్తంగా ఈ షోని చూశారు. ప్రభాస్ ఎపిసోడ్ తో ఆహా ఓటీటీకి బాగా రీచ్ వచ్చింది. అయితే ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా టెలికాస్ట్ చేయాలనుకున్నారు.
ఏడో ఎపిసోడ్ లో కేవలం ప్రభాస్ తో నడిపించి ఎనిమిదో ఎపిసోడ్ లో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్, హీరో గోపీచంద్ ని కూడా తీసుకొచ్చారు. వీరి కాంబినేషన్ ఎపిసోడ్ నేడు జనవరి 6 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ఈ ఎపిసోడ్ కూడా ప్రేక్షకుల్లో బాగా రీచ్ అవుతుంది. ఎనిమిదో ఎపిసోడ్ లో బాలయ్యతో కలిసి ప్రభాస్, గోపీచంద్ రచ్చ రచ్చ చేశారు. ఎపిసోడ్ ఆద్యంతం నవ్వించారు, అలరించారు, ఎన్నో గుర్తుండిపోయే మూమెంట్స్ ని ప్రేక్షకులకి అందించారు.
ఈ షో లో ప్రభాస్ పెళ్ళి గురించి హాట్ టాపిక్ అయ్యింది..ఇప్పుడు మరొకటి..అలాగే ఎపిసోడ్ లో అసలు ప్రభాస్ కి ఎప్పుడు యాక్టర్ అవ్వాలి అనిపించింది, మొదట ఎవరికి చెప్పావు అని బాలయ్య అడగడంతో ప్రభాస్.. నాకు 18 ఇయర్స్ ఉన్నప్పుడు అనుకుంట పెదనాన్న భక్త కన్నప్ప సినిమా చూశాను. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. ఆ సినిమా చూసి నేను కూడా యాక్టర్ అవ్వాలి అనుకున్నా. కానీ మనకి ఉన్న సిగ్గు, మొహమాటంతో కష్టం అనుకోని వదిలేసినా ఎక్కడో యాక్టర్ అవ్వాలి అనిపించేది. మొదట ప్రమోద్ కి చెప్పాను. ప్రమోద్ షాక్ అయ్యాడు, అసలు నీకు అటు సైడ్ ఏమి తెలీదు కదా అని తర్వాత ప్రమోద్ ఇంట్లో వాళ్ళకి చెప్పి అలా పెదనాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాడు. దాంతో పెద్దనాన్న ఒకే చెప్పాడు..అలా జరిగింది అన్నాడు.అప్పుడు B com సెకండ్ ఇయర్ తో స్టడీ ఆపేసాను. యాక్టింగ్ కి సంబంధించి ఏమి చదవలేదు అని తెలిపాడు..అది అసలు సంగతి..చదివింది తక్కువే అయినా పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. ఇక ఈయన వరుస సినిమాల్లో నటిస్తున్నారు.. అవి అన్నీ పాన్ సినిమాలు కావడం విశేషం ..