Veera Simha Reddy మూవీలో కారు సీన్ గురించి డైరెక్టర్ క్లారిటీ

- Advertisement -

ఈ సంక్రాంతికి వచ్చి ప్రభంజనం సృష్టించిన సినిమా Veera Simha Reddy . నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బ్లాక్‌బస్టర్‌ మూవీలో శ్రుతిహాసన్‌ కథానాయిక. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మరోసారి బాలకృష్ణ సంక్రాంతి హీరోగా అదరగొట్టారు. యాక్షన్‌ సన్నివేశాలకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో బాలయ్య పంచకట్టులోనూ సూపర్ స్టైలిష్ గా కనిపించారంటూ ఫ్యాన్స్ తెగ సంబురపడిపోతున్నారు. 

 Veera Simha Reddy
Gopichand Malineni about Veera Simha Reddy

అయితే, ఓ సన్నివేశంలో బాలకృష్ణ తన కాలితో కారును తంతే, వెనక్కి వెళ్తుంది. దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోల్స్‌ మొదలయ్యాయి.‘పలనాటి బ్రహ్మనాయుడు’లో తొడగొడితే రైలు వెనక్కి వెళ్లిన సన్నివేశంతో పోల్చి మీమ్స్‌ కూడా చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గోపిచంద్‌ మలినేని స్పష్టతనిచ్చారు. ఈ సీన్‌పై ట్రోల్‌ చేయాల్సిన అవసరం లేదని అన్నారు.

Veera Simha Reddy

‘‘వీరసింహారెడ్డి పాత్ర గొడ్డలితో కారు ముందు నిలబడినప్పుడు అందులో ఉన్న వాళ్లు రివర్స్‌ గేర్‌ వేసి వెనక్కి వెళ్లాలనుకుంటారు. అయితే, కారు వెనుక చక్రం మట్టిలో కూరుకుపోయి ఉంటుంది. బాలకృష్ణగారు డైలాగ్‌ చెప్పిన తర్వాత కాలితో కారును తంతారు. దీంతో మట్టిలో దిగబడిపోయిన కారు టైరు పైకి లేస్తుంది. అప్పటికే కారు రివర్స్‌ గేర్‌లో ఉంది కదా! అప్పుడది వెనక్కి వెళ్లకుండా ముందుకు వస్తుందా? మీరే చెప్పండి. దాన్ని ట్రోల్‌ చేయాల్సిన అవసరం లేదు. మీమ్స్‌ చేసేవాళ్లు రకరకాలుగా చేస్తారు. బాలకృష్ణగారితో చర్చించే ఈ సీన్‌ తీశా’’ అని గోపీచంద్‌ మలినేని అన్నారు. 

- Advertisement -

“అటు మాస్​ థియోటర్​లో ఇటు​ మల్టీప్లెక్స్​లో సినిమా చూశాను. మాస్​తో పాటు ఫ్యామిలీ ఆడియోన్స్ కూడా​ బాగా కనెక్ట్ అయ్యారు. అసాధారణమైన రెస్పాన్స్ వచ్చింది. నా ఫోన్లు ఇప్పటివరకు మోగుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీ నుంచి చాలా మంది కాల్స్ చేశారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాగా చూపించావని అంటున్నారు. బాలయ్య కాస్ట్యూమ్స్​ విషయానికొస్తే ఆయన క్యారెక్టర్​కు బాగా డెప్త్​ ఉంటుంది. డిజైన్​ చేసేటప్పుడే స్కెచెస్​ వేయించాను.

ఆ తర్వాత బాల్యయకు అది చూపించాను. అయితే మొదట నా మనసులో బ్లాక్​ షర్ట్​ వేద్దాం అన్నప్పుడు బాలయ్యను అడగలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ అప్పుడే బాలయ్య కూడా తమ మనసులో బ్లాక్ ఉందని చెప్పారు. దీంతో నేను కూడా అదే అనుకున్నా సార్​ అంటూ డిజైన్ చూపించాను. ఇక యంగ్ లుక్ బాలయ్య కోసం భాస్కర్​ డిజైనర్​. ఆయన ప్రభాస్​కు పర్సనల్​ డిజైనర్​. ఇక జై బాలయ్య డైలాగ్​ ఓ ట్రెండ్ అయిపోయింది. అందుకే ఆ డైలాగ్ పెట్టాను. జై బాలయ్య పాట విషయానికొస్తే.. ఆ పదం ఓ ఎమోషన్​ అయిపోయింది. అందుకే ఆ పాట ఉంటే ఓ మ్యాజిక్ క్రియేట్​ అవుతుంది నేను తమన్ అనుకున్నాం. అందుకే​ చేశాం. అది వర్కౌట్ అయింది. ప్రేక్షకుల్ని ఆదరిస్తారని అనుకున్నాం. ఆదరించారు.” అని గోపిచంద్​ అన్నారు.

ఇదే ఇంటర్వ్యూలో గోపీచంద్ చిరంజీవి, రవితేజల గురించి కూడా మాట్లాడారు. “చిరంజీవిగారు కూడా బక్క రవితేజ అని పిలిచేవారు. ఓసారి షూటింగ్ స్పాట్​లో ఉన్నప్పుడు నా పుట్టినరోజు వచ్చింది. అప్పుడు అల్లు అరవింద్​ చిరంజీవి వచ్చారు. ఓ వాచ్​ తెప్పించి గిఫ్ట్​గా ఇచ్చారు. అప్పుడు చిరు.. ఇక నీ టైమ్​ బాగుంటుందని అన్నారు. ఇక ఇప్పటివరకు ఏ సినిమాకు నాకు ఫుల్​ రెమ్యునరేషన్​ ఇవ్వలేదు. వీర సింహారెడ్డికే తొలి సారి ఇచ్చారు.” అని గోపి చంద్​ చెప్పుకొచ్చారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here