Box Office Collection : ఈ ఏడాది ప్రారంభం నుండే విడుదలైన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించాయి.. ప్రారంభం లోనే ఇంత భారీ వసూళ్లతో బయ్యర్స్ జోబులు నిండిపోవడం తో అందరూ ఎంత సంతోషం గా ఉన్నారు.. ముందుగా ఈ ఏడాది నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ హంట్ మొదలైంది.. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి సెన్సేషనల్ ఓపెనింగ్స్ దక్కాయి.
ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించిన ఈ సినిమాకి ఫుల్ రన్ లో 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..బాలయ్య కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ గ్రాసర్ గా చెప్పుకోవచ్చు.. ఇక ఈ సినిమా విడుదలైన మరుసటి రోజే మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం విడుదలైంది.. ఈ సినిమా సృష్టించింది ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? రోజు చూస్తూనే ఉన్నాం కదా.
మొదటి రోజు 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించిన ఈ సినిమాకి ఇప్పటి వరకు 135 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.. ఫుల్ రన్ లో మరో 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి 140 కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు..వరుస ఫ్లాప్స్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి కెరీర్ కి మరోసారి బూస్ట్ ని ఇచ్చింది ఈ చిత్రం.. ఇక మెగాస్టార్ చిరంజీవి ఏ రేంజ్ కం బ్యాక్ ఇచ్చాడో బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కూడా అదే రేంజ్ కం బ్యాక్ ఇచ్చాడు.
షారుఖ్ ఖాన్ తో పాటుగా బాలీవుడ్ సినిమా కూడా చాలా కాలం నుండి గడ్డు పరిస్థితి లో ఉంది.. షారుఖ్ ఖాన్ ‘పఠాన్‘ సినిమా ద్వారా తన కం బ్యాక్ మాత్రమే కాకుండా మొత్తం బాలీవుడ్ కి పూర్వ వైభవం తీసుకొచ్చాడు.. కేవలం ఆరు రోజుల్లోనే 600 కోట్ల రూపాయలకు దగ్గరగా వచ్చిన ఈ సినిమా ఫుల్ రన్ లో వెయ్యి కోట్ల రూపాయిలు అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.. ఇక తమిళం లో కూడా అజిత్ ‘తునీవు’ చిత్రం 182 కోట్ల రూపాయిల గ్రాస్ , మరియు విజయ్ ‘వారిసు’ సినిమా 290 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సూపర్ హిట్స్ గా నిలిచాయి.. అలా ప్రతీ ఇండస్ట్రీ ఈ ఏడాది ప్రారంభం నుండి మంచి సక్సెస్ లతో ఇండస్ట్రీస్ కి నూతన సంవత్సరం లోకి గ్రాండ్ వెల్కమ్ చెప్పాయి.