Tollywood లాక్ డౌన్ సమయం లో OTT బాగా వృద్ధిలోకి వచ్చిన తర్వాత మన టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల లాంగ్ రన్ పీరియడ్ గణనీయం గా తగ్గిపోయింది.. ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమా అయినా కేవలం వీకెండ్ వరకే ఆడుతున్న రోజులు ఇవి..అలాంటి సమయం లో కూడా లాంగ్ రన్ ని రప్పించుకున్న కొన్ని సినిమాలు ఉన్నాయి..వాటిల్లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కూడా ఉంది..సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఈ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది.
ఓపెనింగ్స్ దగ్గర నుండి నేటి వరకు ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది..ఇక నిన్న రిపబ్లిక్ డే అవ్వడం తో ఈ సినిమాకి రెండు కోట్ల 11 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..అలా 14 వ రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 3 చిత్రాలలో ఒకటిగా నిలిచింది ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం.
అంతే కాదు ఈ చిత్రం 14 వ రోజున #RRR ని కూడా దాటేసింది..#RRR చిత్రానికి 14 వ రోజు కోటి 80 లక్షలు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి..ఈ రికార్డు ని ‘వాల్తేరు వీరయ్య‘ చిత్రం చాలా తేలికగా దాటేసింది.. మొదటి స్థానం లో బాహుబలి 2 చిత్రం 3 కోట్ల 82 లక్షల రూపాయిల షేర్ వసూళ్లతో ఉండగా, రెండవ స్థానం లో ‘అలా వైకుంఠపురం లో’ చిత్రం రెండు కోట్ల 66 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..మూడవ స్థానం లో ‘వాల్తేరు వీరయ్య’ రెండు కోట్ల 11 లక్షలు వసూలు చెయ్యగా.
నాల్గవ స్థానం లో #RRR కోటి 80 లక్షల షేర్ తో కొనసాగుతుంది..ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “సరైనోడు” చిత్రం కోటి 41 లక్షల రూపాయిల షేర్ తో టాప్ 5 లో నిలవగా , F2 చిత్రం కోటి 33 లక్షల రూపాయిల షేర్ , గీత గోవిందం కోటి 31 లక్షల షేర్ , శతమానం భవతి కోటి 30 లక్షల షేర్ , రంగస్థలం కోటి 26 లక్షల షేర్ మరియు మహర్షి చిత్రం కోటి 20 లక్షల రూపాయిల షేర్స్ తో టాప్ 10 స్థానం లో కొనసాగుతున్నాయి.