Ram Charan: మెగా ఫ్యామిలీ నుంచి చిరుతలా వచ్చి స్టార్ హీరోగా నిలదొక్కుకున్నారు రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. రోజు రోజును తనలోని నటుడిని మెరుగుపెట్టుకుంటూ అందరి అభినందనలు అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. తన కెరీర్లో రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టారు రామ్ చరణ్. ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తన RC16వ సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు పెద్ది అనే పేరు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ మధ్యనే రామ్ చరణ్ కి ఒక అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే.
తన నటనతో ‘రంగస్థలం’పై మెప్పించి ఇండస్ట్రీ ‘గేమ్ ఛేంజర్’గా గుర్తింపు తెచ్చుకున్న ‘చరణ్‘ వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు గౌరవ డాక్టరేట్ కూడా అందించింది యూనివర్సిటీ యాజమాన్యం. వివిధ రంగాల్లో విశిష్ట వ్యక్తులను గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్స్ ఇవ్వటంలో వేల్స్ యూనివర్సిటీ ప్రసిద్ధి చెందింది. ఈ డాక్టరేట్ అందుకునేందుకు ఆయన తన భార్య, పాప క్లింకారా అలాగే పెంపుడు కుక్క రైమ్ తో కలిసి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు. వారు చెన్నైలో దిగిన తర్వాత అక్కడి ఎయిర్ పోర్ట్ లోని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే రామ్ చరణ్ తేజ్ ధరించిన షర్టు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే ఆయన వేసుకున్న షర్టు బ్రాండ్ ఏమిటి? అని ఢీకొట్ చేసే పనిలో పడ్డారు కొందరు నెటిజన్స్. అందులో ఒకరు షర్ట్ కంపెనీ డిఆర్. ఆ షర్టు ద్వారా దాదాపు రూ.63 వేల చిల్లర ఉంటుందని తేల్చేశారు.
View this post on Instagram