Sai Pallavi : ఆ పాత్రకు సాయి పల్లవినే కరెక్ట్.. ఈ బ్యూటీ లక్ తిరిగిపోయినట్లేనా..!

- Advertisement -

Sai Pallavi : టాలీవుడ్ లో తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది సాయి పల్లవి. తన వద్దకు వచ్చిన ప్రాజెక్టుల్లో ఎంతటి స్టార్ కాస్టింగ్ ఉన్నా.. కథ నచ్చకపోయినా, రోల్ కు స్కోప్ లేకపోయినా వెంటనే సింపుల్ గా రిజెక్ట్ చేసేస్తోంది. ఇలా ఇప్పటి వరకు ఆమె ఎన్నో మూవీలు రిజెక్ట్ చేసింది. ప్రస్తుతం తెలుగులో తండేల్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కినేని నాగ చైతన్యకి జోడీగా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఇక సాయి పల్లవి.. బాలీవుడ్ రామాయణ్ లో నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా సెట్స్ లో ఆమె అడుగు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్ కనిపించనున్నారు. రేపు(ఏప్రిల్ 17) శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. దీంతో నెట్టింట ఆమె ఫ్యాన్స్ ఫుల్ సందడి చేస్తున్నారు. అయితే మైథలాజికల్ సినిమాల్లోని పాత్రలకు నటీనటుల ఎంపిక కాస్త కష్టమైన పనే. గతంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిన మూవీల్లో నటీనటుల సెలక్షన్ పై ట్రోల్స్ వచ్చాయి.

- Advertisement -

గత ఏడాది ఆదిపురుష్ లో కృతి సనన్ సీతగా నటించగా.. చాలా మంది వ్యతిరేకించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో సీత పాత్రకు కంగన రనౌత్ పేరు వినిపించగా.. నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. కానీ సాయి పల్లవి విషయంలో ఇప్పటి వరకు ఒక్క ట్రోల్, నెగిటివ్ పోస్ట్ కూడా కనిపించలేదు. దీంతో ఈ పాత్రకు ఆమె మాత్రమే కరెక్ట్ అని అంటున్నారు. అంతే కాదు దీని తర్వాత సాయి పల్లవి దశ తిరిగిపోతుందని చెబుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here