Ram Charan : మార్చి 27న రామ్‌చరణ్‌ పుట్టినరోజు.. RC16 ఫస్ట్‌లుక్‌ విడుదల..?

- Advertisement -

Ram Charan : ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సంపాదించాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈ క్రేజ్ ని మరింత పెంచుకోవడానికి క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ఇప్పుడు చరణ్ గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకోవాల్సిన ఈ సినిమా డిలే అవుతూనే ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ గేమ్ చేంజర్ సినిమా నుంచి బయటకి రాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా శంకర్ అండ్ టీమ్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రెండ్స్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న డిలేని కవర్ చేస్తూ ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వడానికి RC 16 రెడీ అవుతోంది. బుచ్చిబాబు సన, చరణ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతోంది.

Ram Charan
Ram Charan


రెహమాన్ మ్యూజిక్ తో ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న RC 16 కోసం త్వరలో హైదరాబాద్ లోని బూత్ బంగ్లా దగ్గర ఒక భారి సెట్ వేయనున్నారు. ఈ సెట్ లోనే షూటింగ్ స్టార్ట్ చేయడానికి టీమ్ ప్రిపేర్ అవుతోంది. గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకూ చరణ్ RC 16 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయరు అనుకున్నారు కానీ ఆ ప్రాజెక్ట్ మరింత డిలే అవుతూ ఉండడంతో బుచ్చిబాబు సినిమాని స్టార్ట్ చేయలని డిసైడ్ అయ్యాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే RC 16 నుంచి ఫస్ట్ లుక్ ని చరణ్ బర్త్ డే రోజు ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టిన రోజున RC 16 ఫస్ట్ లుక్ బయటకి వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో గేమ్ చేంజర్ నుంచి కూడా “జాబిలమ్మ” సాంగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here