Ram Charan Upasana : స్టేజ్ పై నుంచి ఉపాసనకు రామ్ చరణ్ సైగలు.. క్యూట్ రొమాన్స్ అంటూ నెటిజన్ల కామెంట్స్

- Advertisement -

Ram Charan Upasana గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జోడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్​లో పవర్ కపుల్ గా పేరొందింది ఈ జంట. ఈ ఇద్దరూ తమ వర్క్ లైఫ్ లో బిజీగా ఉంటూనే సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటారు. ఇక తమ వర్క్ లైఫ్ లో ముఖ్యమైన ఈవెంట్స్ లో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు.

ఇటీవల రామ్ చరణ్ చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీలో డాక్టరేట్ పట్టా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కు చెర్రీతో కలిసి ఉపాసన కూడా వెళ్లింది. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. అందులో  ఓ వీడియో మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే

- Advertisement -

ఈ వీడియోలో రామ్ చరణ్ స్టేజ్ మీద కూర్చొని ఉన్నాడు. ఆడియెన్స్ లో ఫ్రంట్ రోల్ లో ఉపాసన కూర్చుంది. అయితే చెర్రీ స్టేజ్ పై నుంచి ఉప్సీకి ఏవో సైగలు చేశాడు. దానికి ఉప్సీ కూడా రెస్పాండ్ అయింది. ఇంతకీ వాళ్లిద్దరు ఏం మాట్లాడుకున్నారో అర్థం కాలేదు కానీ.. ఈ జంట క్యూట్ ఇంటరాక్షన్ చూసి నెటిజన్లు మాత్రం ఫిదా అవుతున్నారు.  క్యూట్ వీడియో, కపుల్ గోల్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ ఇద్దరి క్యూట్ నెస్ కు చూసి మురిసిపోతున్నారు. వావ్ వాట్ ఏ క్యూట్ కపుల్ అంటూ హార్ట్ ఎమోజీస్ పోస్టు చేస్తున్నారు.

ఇక రామ్ చరణ్ సినిమా సంగతికి వస్తే.. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్​లో బిజీగా ఉన్నాడు. పొలిటికల్​ యాక్షన్​ థీమ్​తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో రామ్​చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. నటి అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్​రాజు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్​పై శిరీష్​తో కలిసి రూపొందిస్తున్నారు. ఇటీవలే చెర్రీ బర్త్​డే స్పెషల్​గా ఈ చిత్రం నుంచి జరగండి అనే సాంగ్​ను విడుదల చేేేశారు. ఈ పాటలో బ్యాక్​గ్రౌండ్ సెట్స్, విజువల్ వర్క్స్​ అదిరిపోయాయి. ముఖ్యంగా రామ్​చరణ్- కియారా లుక్స్​, స్క్రీన్ ప్రెజెన్స్ సాంగ్​కు హైలైట్​గా నిలిచాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here