Mythri Movie Makers : ఒకేసారి ఇద్దరు అగ్ర హీరోలతో సినిమాలు తీయడం నిర్మాణ సంస్థలకు కొత్తేమి కాదు.. కానీ ఒకే టైంలో రిలీజ్ చేయడం మాత్రం అరుదు. అనుకోకుండా జరిగిందో లేక ప్లాన్ చేసుకుని వచ్చారో కానీ మైత్రి మూవీ మేకర్స్ కి ఈ ఘనత దక్కింది. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డిలను సంక్రాంతి సీజన్ లోనే తీసుకురావడం బహుశా టాలీవుడ్ లోనే ఫస్ట్ టైం అని చెప్పాలి. ఈ ఇద్దరూ పరస్పరం తలపడటం చాలా సార్లు జరిగింది కానీ ఇలా ప్రొడక్షన్ హౌస్ కోణంలో ఢీ కొట్టడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి.. అయితే ఇలాంటి ప్రాజెక్టులు తెరకెక్కుతున్నప్పుడు అప్డేట్స్ కోసం అభిమానుల నుంచి ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు..
ఎంత బయట ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి ఉన్నా మైత్రి అధినేతలు వాటిని బాలన్స్ చేసిన తీరు నిజంగా వావ్ అనే చెప్పాలి. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే రీతిలో కాకుండా లిరికల్ సాంగ్స్ విడుదలతో మొదలుపెట్టి పోస్టర్లు, మేకింగ్ వీడియోలు, ఇంటర్వ్యూలు, మీట్ ది ప్రెస్ లు, టీజర్లు, ట్రైలర్లు అన్నీ ఒకపద్ధతి ప్రకారం ఒకటి ముందు తర్వాత మరొకటి వెంటనే దీనికి ఆపొజిట్ సిరీస్ లో కూడా మొత్తం పక్కా ప్లానింగ్ తో జరిగిపోయింది. దీని కోసమే ప్రత్యేకంగా రెండు బృందాలను ఏర్పాటు చేసి వాటి మధ్య సమన్వయం వచ్చేలా డిజైన్ చేసుకున్న తీరు సినీ అభిమానులను ఆకట్టుకుంది..
ఇక అసలు విషయానికొస్తే..సంక్రాంతి కానుకగా విడుదల అయిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాయి. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమా నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 104 కోట్ల గ్రాస్ రాబట్టింది. సుమారు 60కోట్ల షేర్ని దక్కించుకుంది. అంతేకాదు ఓవర్సీస్లో అన్ని స్టేట్స్ లో కలిసి సుమారు పది కోట్లు వసూలు చేయడం విశేషం.
ఇక వాల్తేరు వీరయ్య సినిమా మూడు రోజుల్లో 108 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంటే దాదాపు 60 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి..మొదట రిలీజ్ అయిన వీరసింహారెడ్డి కలెక్షన్లు డ్రాప్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి కంటే వాల్తేర్ వీరయ్యకి తక్కువ థియేటర్లే కేటాయించినా కలెక్షన్లు ఎక్కువ రావడం విశేషం.. మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవనే చెప్పాలి..