Jhony master : జానీ మాస్టర్ ఇంత కరువులో ఉన్నాడా.. సుమతో కూడా అదేపనా?

- Advertisement -

Jhony master : తెలుగు బుల్లితెర యాంకర్ సుమ గురించి అందరికీ తెలుసు..మొదట ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత యాంకరింగ్ రంగంలోకి అడుగుపెట్టి ప్రస్తుతం ఇండస్ట్రీలోనే స్టార్ యాంకర్ గా కొనసాగుతోంది.ఈమె బుల్లితెర మీద ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ అలాగే సినిమాలకు సంబంధించిన ప్రతి ఒక్క ఈవెంట్లో కనిపిస్తుంది. అంతే కాదు పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం తమ ఆడియో ఫంక్షన్లలో ప్రీ రిలీజ్ ఈవెంట్లలో suma ఉండాల్సిందే అంటారు..అంతలా ఫేమస్ అయ్యింది సుమ.. ప్రస్తుతం సుమ సుమ అడ్డా అనే ప్రోగ్రాం చేస్తుంది..ఆ షోకు జానీ మాస్టర్ వచ్చా రు..సుమను కూడా వదలకుండా ప్రపోజ్ చేశాడు..అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

Jhony master
Jhony master

ఇక ఇందులో ఏముందంటే.. సుమ శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ ల మీద పంచుల వర్షం కురిపించింది. అలాగే వీరు ముగ్గురు కలిసి ప్రేమదేశం సినిమాని ఇమిటేట్ చేస్తూ షో లో నవ్వులు పూయించారు. సుమ ఎటువంటి క్యారక్టర్ లో అయిన ఒదిగి పోయి నటిస్తుంది.. ఇక ఇందులో సుమ హీరోయిన్ టబు పాత్రలో నటించింది. సుమ నాకు లిఫ్ట్ ఇస్తారా అంటూ జానీ మాస్టర్ ని అడుగుతుంది.

Suma Adda
Suma Adda

అందుకు Jhony master ఎందుకు ఇవ్వను తప్పకుండా ఇస్తాను అంటూ అంటారు. అలాగే జానీ మాస్టర్ చేసే చిలిపి పనులను గమనించిన సుమ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి అని అడిగేసరికి జానీ మాస్టర్ టక్కున నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అనేశారు. దానికి ఒక్కసారిగా సుమ షాక్ అయింది. అలాగే వీరు ముగ్గురు కలిసి ప్రేమదేశం సినిమాలోని ఒక పాటకు డాన్స్ చేశారు.మొత్తానికి ఈ ప్రోమో లో ఎన్నో పంచుల వర్షం తో ముగిసింది. ఇక ఈ ప్రోగ్రాం కి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ చూడాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.. మొత్తానికి ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here