Tamana : తమన్నా కూడా ఆ టైపా..మరీ ఇంత పబ్లిక్గా చెప్పాలా..?
మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఎన్నో హిట్ సినిమాల్లో నటించడం మాత్రమే కాదు..బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాల్లో కూడా నటించి మంచి టాక్ ను అందుకుంది..ఒకప్పుడు వరుస హిట్ సినిమాల్లో నటించింది.. ఈ మధ్య తెలుగులో అమ్మడుకు పెద్దగా అవకాశాలు రాలేదు..దాంతో బాలివుడ్ లో సినిమాలు చేస్తుంది..కాగా, ఈ అమ్మడు గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది.. బాలివుడ్ నటుడుతో ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతుంది..
గతంలో ఈమె పెళ్ళి ఎన్నో వార్తలు వినిపించాయి. ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ సారి పెళ్లి కాదు కానీ డేటింగ్‌లో ఉన్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘ఎమ్‌సీఎ’ నటుడు విజయ్ వర్మతో ఈ ముద్దుగుమ్మ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మిల్కీ బ్యూటీ.. న్యూ ఇయర్ వేడుకల్ని అతడితో కలిసి గోవాలో స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోల్లో తమన్నా, విజయ్ వర్మ సన్నిహితంగా కనిపించారు..
మరి కొన్ని వీడియోల్లో ముద్దులు కూడా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం ఊపందుకుంది.ఇకపోతే వీరిద్దరు కలిసి లస్ట్ స్టోరీస్ -2లో జంటగా నటిస్తున్నారు. 2018లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన లస్ట్ స్టోరీస్‌కు కొనసాగింపుగా ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు టాక్. ఇకపోతే గత కొద్ది రోజులుగా తమన్నా, విజయ్ వర్మ కలిసి తిరుగుతున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..మొత్తానికి వీరిద్దరి మధ్య అది ఉందంటూ ప్రచారం జరుగుతుంది..మరి నిజమేంటో వాళ్ళే చెప్పాలి..