బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 మొదలై రెండు వారాలు పూర్తయి మూడో వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం రోజున నామినేషన్లు పూర్తయ్యాయి. నామినేషన్ తర్వాత నుంచి హౌజ్‌లో ఇంట్రెస్టింగ్ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వారం నామినేషన్లలో యావర్‌ను రతిక నామినేట్ చేసింది. అయితే ఈ ప్రోమోలో మాత్రం ఆ ఇద్దరూ కలిసిపోయినట్లు కనిపిస్తోంది. కేవలం కలిసిపోవడమే కాదు.. యావర్ రతికకు బహిరంగంగానే లైన్ వేస్తున్నాడు. అది చూసిన పల్లవి ప్రశాంత్ ఈ సరసాలేంట్రా బాబు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ ట్రయాంగిల్ ఫ్లర్టేషన్ బిగ్‌బాస్ హౌజ్‌పై ప్రేక్షకులకు ఇంట్రెస్ట్‌ని కలిగిస్తోంది. అసలేం జరిగిందంటే..?
ఈ ప్రోమోలో కిచెన్‌లో రతిక, యావర్ మరో ఇద్దరు కంటెస్టులు ఉన్నారు. ఈ సందర్భంగా యావర్ తనకు తెలుగు రాదంటూ కంటెస్టెంట్లు పదే పదే అనడంపై.. నామినేషన్లకు కూడా అదే రీజన్ చెప్పడంపై తీవ్రంగా ఫైర్ అయ్యాడు. ఆ క్షణం యావర్ చాలా కోపంగా కనిపించాడు. కానీ మరుక్షణమే రతిక వైపు తిరిగి.. రతిక నేను నీకున్నానంటూ చెప్పాడు. ఈ క్రమంలో.. ఆ ఇద్దరి మధ్య చూపులు.. రొమాన్స్‌ను హౌజ్‌మేట్స్ చూసి షాక్ అయ్యారు.
మరోవైపు యావర్ రతికకు అన్నం తినిపించడం.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే ప్లేట్లో తినడం చూసి హౌజ్‌మేట్స్ ఆశ్చర్యపోయారు. దీనిపై దామిని అండ్ గ్యాంగ్ కాస్త గట్టిగానే రియాక్ట్ అయింది. దామిని గౌతమ్‌తో మాట్లాడుతూ.. హేయ్ గౌతమ్ నెక్స్ట్ నామినేషన్లో నేను నిన్ను నామినేట్ చేస్తా.. తర్వాత మనిద్దరం కలిసి ఒకే ప్లేట్లో తిందాం అంటూ గౌతమ్‌ను ఆటపట్టిస్తూనే.. రతిక ప్రవర్తనను ఇమిటేట్ చేసింది.
ఇక ప్రోమో వీడియోలో చివరన శివాజీ ఎవరిమీదో ఫైర్ అవుతూ కనిపించాడు. ఇంతకుముందు కాఫీ కోసం బిగ్‌బాస్‌తో కలిసి ప్రాంక్ చేసిన శివాజీ ఈసారి కూడా ప్రాంక్ చేస్తున్నాడా లేదా నిజంగానే కోపంగా ఉన్నాడా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే శివాజీ అరవడం.. ఆ తర్వాత అమర్దీప్ శివాజీ మాట్లాడిన దానిపై ప్రియాంకాతో మాట్లాడటం చూస్తుంటే.. శివాజీకి కోపం తెప్పించే పనేదో అమర్దీప్ చేశాడని అనిపిస్తోంది. మరి అమర్‌దీప్‌కు బిగ్‌బాస్ సీక్రెట్ టాస్కు ఏదైనా ఇచ్చాడేమో అని నెటిజన్లు అనుకుంటున్నారు.
ఏదైమైనా ఇవాళ్టి ఎపిసోడ్ ఫుల్ ఫన్ తెప్పించేలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఓవైపు రతిక-యావర్ రొమాన్స్.. ఇంకోవైపు రతిక-పల్లవి ప్రశాంత్-యావర్ ట్రయాంగిల్ ఫ్లర్టేషన్.. మరోవైపు శివాజీ వర్సెస్ అమర్దీప్.. ఇదంతా చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్ అద్దిరిపోతుందని బిగ్‌బాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలంటే మరి ఇవాళ రాత్రి వరకు వేచి చూడాల్సిందే.