Prabhas : ఏంటీ.. ఇది నిజమా? ప్రభాస్ కు పెళ్లి అచ్చిరాదా.. అనుష్కతో ప్రేమ..?

- Advertisement -

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..బాహు బలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు..నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తున్నాడు. కానీ పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. ఇప్పటికే ప్రభాస్ వయసు 43కు చేరువైంది. ఈయన ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని గత పదేళ్ల నుంచి అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. బాహుబలి సినిమా విడుదల తర్వాతే ప్రభాస్ ఓ ఇంటివాడు అవుతాడని అందరూ భావించారు.. కానీ డార్లింగ్ సైలెంట్ అయ్యాడు.. ఆ తర్వాత అనుకున్నా కూడా అది కాలేదు..అప్పటి నుంచి ఇప్పటివరకు మాట మారుస్తూ వస్తున్నాడు..డార్లింగ్ కూడా ఆ ఉద్దేశం లేదా అనే ఆలోచనలు కూడా కొందరికి వస్తున్నాయి..

Prabhas
Prabhas

ఇప్పటికే ప్రభాస్ పెళ్లిపై ఎన్నో రకాల రూమెర్స్ బయటకు వచ్చాయి.. ముఖ్యంగా ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని.. ఆమెను పెళ్లి చేసుకోవడం ఖాయం అని గతంలో గట్టిగా ప్రచారం జరిగింది. అభిమానులు కూడా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ముచ్చటపడ్డారు. అయితే ఈ ప్రచారాన్ని ఇటు ప్రభాస్, అటు అనుష్క ఇద్దరూ కొట్టిపారేశారు. తాము కేవలం ఫ్రెండ్స్ అని కుండబద్దలు కొట్టారు..

Actor Prabhas
Actor Prabhas

ఇకపోతే బాలివుడ్ బ్యూటీ కృతిసనన్ తో డార్లింగ్ డేటింగ్ చేస్తున్నారని వార్తలు వినిపించాయి.. చివరకు అవి కూడా తుస్సుమని తేలిపోయాయి. ఇక ఎక్కడికి వెళ్ళినా ప్రభాస్ ను పెళ్లి ఎప్పుడు..? అన్న ప్రశ్న వెంటాడుతూనే ఉంది. కానీ, ఆయన మాత్రం ప్రతిసారి మాట దాటేస్తూనే వచ్చాడు. అయితే రీసెంట్ గా జ్యోతిష్యుడు వేణు స్వామి ప్రభాస్ పెళ్లి పై షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ఈయన గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం తర్వాత ఆయన పేరు మార్మొగిపోయింది.

- Advertisement -
Marrige
Marrige

అప్పటి నుంచి ఆయన ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీల భవిష్యత్తు గురించి చెప్తూ వీడియోలు పోస్ట్‌ చేయడం.. అవి వైరల్ అవ్వడం కామన్‌గా మారింది. ఈ క్రమంలో వేణు స్వామి ప్రభాస్‌ పెళ్లి పై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ కు పెళ్లి అచ్చిరాదని.. కాదని చేసుకుంటే విడాకులు పక్కా అని వేణు స్వామి జ్యోతిష్యం చెప్పాడు. అంతేకాదు, పెళ్లి జరిగితే హీరో ఉదయ్‌ కిరణ్‌ జీవితం ఎలా అయ్యిందో.. ప్రభాస్ కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు..ఇది విన్న సినీ అభిమానులు ఉలిక్కి పడ్డారు..అయితే ఇక డార్లింగ్ కు పెళ్ళి జరగదా అని ఆలోచనలో పడ్డారు..ఆయన ఫ్యాన్స్‌ మాత్రం తలలు పట్టుకున్నారు. ఇది ఎంత వరకు వెలుతుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here