ఎంతోమంది హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అడపా దడపా సినిమాలలో నటించి కనుమరుగవుతుంటారు. అలాంటి వాళ్లు చాలామంది హీరోయిన్సే ఉన్నారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే చేసింది తక్కువ సినిమాలే అయినా వాటి నటనతో ప్రేక్షకుల మదిలో ఎప్పుడూ గుర్తుండిపోయేలా పదిలమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ కోవకు చెందిన హీరోయినే శరణ్య మోహన్. నిజానికి ఈమె కోలీవుడ్ కు చెందిన నటి. అక్కడ పలు చిత్రాల్లో నటించి పాపులారిటీ సంపాదించుకుంది. నాని సినిమా భీమిలి కబడ్డీ జట్టులో అమాయకమైన తెలుగమ్మాయిగా నటించి తెలుగు వారికి దగ్గరైంది శరణ్య. భీమిలి కబడ్డీ జట్టు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో కేవలం కళ్లతో నటించి ఆహా అనిపించింది.

భీమిలి సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. పలు రకాల పాత్రలను చేసి పాపులర్ అయింది. కాకపోతే తమిళంలోనే ఎక్కువ సినిమాలో చేసింది.నటించింది. కృష్ణుడితో 2009లో తెలుగులో వచ్చిన విలేజ్ లో వినాయకుడు సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయమైంది. తన కెరీర్లో తెలుగు, తమిళ్, మళయాళంలో దాదాపుగా 25 సినిమాలలో నటించింది. హీరోయిన్ గానే కాకుండా చెల్లెలి పాత్రలను కూడా చేసింది.

కెరీర్ పీక్‌లో ఉండగానే 2014తో పెళ్లి చేసుకుని నటనకు స్వస్తి పలికింది. ప్రస్తుతం తను కుటుంబ బాధ్యతలను నెరవేర్చుతుంది. తన భర్త పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. తరచూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు రకాలు ఫోటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా శరణ్య ఫ్యాన్స్ ఈమె కోసం గూగుల్లో సెర్చ్ చేయగా కొన్ని ఫోటోలు తాజాగా పోస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫోటోలు చూసి చాలామంది గుర్తుపెట్టలేనంతగా మారిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం శరణ్య మోహన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
