మన్మథుడు నాగార్జునకు కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా? అస్సలు ఊహించరు

- Advertisement -

అక్కినేని వారసుడి టాలీవుడ్ లోకి అడుగుపెట్టి అగ్రహీరోగా ఎదిగారు నాగార్జున. హీరోగానే పరిమితం కాకుండా సినీ నిర్మాతగా, హోస్ట్ గా, వ్యాపారవేత్తగా నాగార్జున బంపర్ హిట్ కొట్టారు. రెండు చేతులా పుష్కలంగా సంపాదిస్తున్నారు. టాలీవుడ్ మన్మథుడిగా యువతుల హృదయాల్లో నిలిచిపోయారు. ఎదిగి వచ్చిన కొడుకులు ఉన్నా వయసు మాత్రం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. నాగ్ తన కెరీర్లో ఎన్నో ప్రయోగాత్మకమైన చిత్రాలు తీశారు. అలాగే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చిత్రాల్లో హీరోగా నటించారు.

నాగార్జున
నాగార్జున

నిన్నే పెళ్లాడుతా వంటి క్లాసిక్స్ ఆల్ టైం ఫేవరేట్. కేవలం సినిమాలతోనే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ తన హస్తం అందిస్తున్నారు. సాధ్యమైనంత మందిని తన వంతు సాయం చేస్తుంటారు. ఇన్నేళ్ల కెరీర్లో దాదాపు ఆయన మీద ఎలాంటి వివాదాలు లేవనే చెప్పాలి. అలాంటి వాటికి నాగార్జున చాలా దూరంగా ఉంటారు. అందరితో చాలా సఖ్యతగా నడుచుకుంటారు. తన ముఖంపై ఎల్లప్పుడు చిరునవ్వుతో స‌ర‌దాగా ఉంటారు. దాదాపు నాగార్జున కోప్పడడం ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే నాగ్ స్వీట్ అండ్ కూల్ ప‌ర్సన్ అని అందరూ భావిస్తారు. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆయనకు కూడా కోపం వస్తుంది.. మరి ఆయన కూడా మనిషే కాదా.. కోపం, టెన్షన్స్, చిరాకు ఆయ‌న‌కీ ఉంటాయి. విచిత్రమైన విషయం ఏంటంటే నాగార్జునకు కోపం వస్తే అది పోగొట్టుకునేందుకు ఓ పనిచేస్తాడట. అది వింటే తప్పకుండా ఆశ్చర్యపోతారు.

ఇదే విషయంపై తన కొడుకు అఖిల్ ఇటీవల చెప్పాడు. ఆయన ఏమన్నారంటే.. మా నాన్న చాలా వరకు కూల్ గానే ఉంటాడు.. ఒకవేళ కోపం వ‌చ్చినా, మూడ్ బాలేకపోయినా వెంట‌నే కిచెన్ లోకి వెళ్లి వంట చేస్తారు. కుకింగ్ లో నాన్న ఎక్స్ పర్ట్. మా అంద‌రి కోసం తాను టేస్టీ టేస్టీగా ఉండే ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటారు. ఎప్పుడైనా షూటింగ్స్ కంప్లీట్ చేసుకుని నేను ఇంటికి వచ్చే సమయానికి నాన్న కిచెన్లో ఉంటే నాకు వెంటనే అర్థమైపోతుంది. ఆయన కోపంలో ఉన్నారని.. అంటూ అఖిల్ చెప్పాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నాగ్.. వంట చేస్తున్నారంటే ఆయనకు కోపం వచ్చిందని.. ప్రస్తుతం నాగార్జున ఏ సినిమాను అనౌన్స్ చేయలేదు. ది ఘోస్ట్‌ నాగార్జున నటించిన ఆఖరి చిత్రం. ప్రస్తుతం ప్రముఖ రైటర్ ప్రసన్న కుమార్‌ బెజవాడను డైరెక్టర్ గా ప‌రిచ‌యం చేస్తూ నాగ్ ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని టాక్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here