Sridevi Chiranjeevi : ‘వాల్తేరు వీరయ్య’ నుంచి రొమాంటిక్ సాంగ్ ఔట్..

- Advertisement -

Sridevi Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి బరిలో విడుదలకు రెడీ అవుతుంది.. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది..ఈ సినిమాలో చిరు మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు..ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అప్డేట్స్ అన్నీ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి..

Sridevi Chiranjeevi
Sridevi Chiranjeevi


అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘బాస్ పార్టీ’కి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. కాగా, ఇప్పుడు ఈ సినిమాలోని రెండో సింగిల్ సాంగ్‌గా ‘శ్రీదేవి చిరంజీవి’ అనే రొమాంటిక్ పాటను రిలీజ్ చేసేందుకు వాల్తేరు వీరయ్య అండ్ టీమ్ రెడీ అయ్యింది. ఈ పాటను డిసెంబర్ 19న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించగా, తాజాగా ఈ పాటను రిలీజ్ చేసే టైమ్‌ను కూడా ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్.

ఈ రొమాంటిక్ సాంగ్‌ను డిసెంబర్ 19న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, జనవరి 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయ్యింది…మరి సినిమా ఎలా వుంటుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here