Anupama Parameswaran : అందానికే అందమనిపించగా.. దిగివచ్చేనో ఏమో దివి కానుక



మలయాళి కుట్టి Anupama Parameswaran.. తన బబ్లీ లుక్స్.. నూడుల్స్ లాంటి హెయిర్‌.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును మాయ చేస్తోంది. ప్రేమమ్ రీమేక్‌తో తెలుగు తెరపై సందడి షురూ చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. అచ్చ తెలుగు అమ్మాయిలా తెలుగు మాట్లాడుతూ.. తెలుగు డబ్బింగ్ కూడా చెప్పుకుంటూ టాలీవుడ్‌ని ఏలేస్తోంది.

Anupama Parameswaran
Anupama parameswaran

ప్రేమమ్, అఆ సినిమాల్లో చేసింది చిన్న పాత్రలే అయినా చిరకాలం గుర్తుండిపోయేలా మాయ చేసింది ఈ బ్యూటీ. ఇక మాటల మాంత్రికుడి చేతిలో పడిన తర్వాత ఈ భామకు ఆఫర్లకు కరువు లేకుండా పోయింది. వరుస సినిమాలు చేస్తూ తన సత్తా ఏంటో చూపిస్తోంది. డీ గ్లామర్ పాత్రల్లో కూడా ఈ బ్యూటీ ఆకట్టుకుంటోంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఫ్రీడమ్ @ మిడ్‌నైట్‌ లాంటి షార్ట్ ఫిల్మ్స్‌కి సై అంటోంది.

Anupama Parameswaran  Images
Anupama parameswaran

రీసెంట్‌గా ఈ బ్యూటీ నటించిన కార్తికేయ 2 బ్లాబ్‌బస్టర్ బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీ సక్సెస్ జోష్‌లో ఉన్న అనుపమ మరో నాలుగైదు సినిమాల్లో నటిస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా తన హవా చూపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కార్తికేయ కో స్టార్ నిఖిల్‌తో 18 పేజెస్ అనే సినిమాలో నటిస్తోంది.

Anupama parameswaran pics

అంతే కాకుండా బటర్‌ఫ్లై’ అనే మూవీలో కూడా నటిస్తోంది. మిస్టరీ థ్రిల్లర్‌ జోనర్‌లో రానున్న ఈ సినిమా ట్రైలర్‌ని బట్టి చూస్తే పిల్లల కిడ్నాప్‌ చూట్టూ ఈ కథ తిరుగుతున్నట్లు అర్థమవుతోంది. కిడ్నాప్‌ అయిన పిల్లలను అనుపమ పరమేశ్వరన్ కాపాడుకుంటుందా.. కిడ్నాపర్‌ పిల్లలను చంపేశాడా.. ఇలా సస్పెన్స్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది.

Anupama parameswaran SAree Photos
Anupama parameswaran

సోషల్ మీడియాలోనూ అనుపమ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన క్యూట్ ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తూ ఉంటుంది. తాజాగా బ్లూ కలర్ శారీలో అనుపమ తన ఫొటోలు షేర్ చేసింది. తన నడుము ఒంపు చూపిస్తూ వొయ్యారాలు పలుకుతూ దిగిన ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ నడుము సొగసు చూపిస్తూ అనుపమ మత్తెక్కించే పోజులు కుర్రాళ్లకు నిద్ర పట్టకుం డా చేస్తున్నాయి.

Anupama parameswaran

కొన్ని స్టిల్స్ క్యూట్‌గా, మరికొన్ని స్టిల్స్‌లో చిరునవ్వుతో అనుపమ ఇస్తున్న పోజులు అదరహో అనిపిస్తున్నాయి. కార్తికేయ 2 పాన్ ఇండియా ఘన విజయం తర్వాత సోషల్ మీడియాలో అనుపమ జోరు మామూలుగా లేదు. ఈ బ్యూటీ ఎక్కువగా గ్లామర్ షో చేయకుండానే యువతకి అభిమాన హీరోయిన్‌గా మారిపోయింది.