ప్రభాస్ ని పెళ్లి చేసుకోమని..అనుష్కను ఒత్తిడి చేస్తున్న డైరెక్టర్

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, నటి అనుష్క శెట్టి మ‌ధ్య ప్రేమ ఉంద‌ని అభిమానులు, నెటిజ‌న్స్ అనుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఎంత మంది సెలబ్రిటీలు ఉన్న, వారిపై ఎన్ని గాసిప్ వార్తలు వచ్చిన ప్రభాస్ అనుష్క గాసిప్స్ మాత్రం ట్రెండింగ్ లో ఉంటాయి. ఇద్ద‌రూ పెళ్లి చేసుకుంటార‌నే వార్త‌లు కూడా సోష‌ల్ మీడియాలో హల్ చల్ చేసినా వాళ్లు మాత్రం సైలెంట్‌గానే ఉంటూ వ‌స్తున్నారు. త‌మ మ‌ధ్య మంచి స్నేహం త‌ప్ప మరేమీ లేద‌ని ప్ర‌భాస్, అనుష్క‌లు చెబుతున్నారు. అయితే కొన్ని రోజుల ముందు ప్ర‌భాస్‌కి, కృతిస‌న‌న్‌కి మ‌ధ్య ఏదో ఉందంటూ వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌ల‌ను ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ ఖండించారు. అయితే ఇప్పుడు మ‌రోసారి ప్ర‌భాస్‌, అనుష్క‌లు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యారు.

ప్రభాస్
ప్రభాస్

హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వీరి పెళ్లికి సంబంధించిన విషయం ట్రెండ్ అవుతోంది. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ అనుష్కతో ప్రభాస్ ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశాడని సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. బాహుబలి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్, అనుష్క పలు మీడియా ఛానెల్‌లకు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్‌లో ఇంటర్వ్యూల క్రమంలో దర్శక-నిర్మాత-నటుడు కరణ్ జోహార్ కూడా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో కరణ్ జోహార్ తన వ్యక్తిగత విషయాలను కదిలించాడు. ‘అనుష్కతో.. మీకు ప్రభాస్ అంటే ఇష్టమైతే మాట్లాడుతాను.. మీ జంట బాగుంటుంది..

Prabhas

నేను ఒప్పిస్తాను’ అంటూ లేనిపోని ప్రయత్నం చేశాడట. అనుష్క తెలివైంది.. అజాగ్రత్తగా ఎక్కడా నోరుజారదు. “ప్రభాస్ నా స్నేహితుడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త రూమర్” అని ఆమె అన్నారు. అయితే అనుష్కకు ప్రభాస్ అంటే ఇష్టం ఉన్నా కానీ అతగాడి ఇవ్వాల్మెంట్ ఇష్టం లేకనే కరణ్ జోహార్ తో అలా చెప్పింది అని ప్రభాస్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here