‘భోళా శంకర్’ టీజర్ లోని హైలైట్స్ ఇవే..24 వ తేదీ ఫ్యాన్స్ కి పండగే!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న ‘భోళా శంకర్’ మూవీ ఆగష్టు 11 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని ఈనెల 24 వ తేదీన విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలుగా నటిస్తుంది.

భోళా శంకర్
భోళా శంకర్

తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన అజిత్ వేదలమ్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. పేరుకి రీమేక్ అయ్యినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి, ఫ్యాన్స్ పండుగ చేసుకునే విధంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మొదటి పాట ని విడుదల చెయ్యగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాకి మణిశర్మ కొడుకు మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు.ఇక పోతే ఎల్లుండి విడుదల అవ్వబొయ్యే టీజర్ లో మెగాస్టార్ మార్క్ హీరోయిజం మరియు ఎలివేషన్ సన్నివేశాలు ఉంటాయట. వాటితో పాటుగా ఈ టీజర్ లో ఒక పవర్ ఫుల్ డైలాగ్, కామెడీ షాట్స్ మరియు రొమాంటిక్ షాట్స్ ఇలా చిరంజీవి సినిమా నుండి ఏవైతే అన్నీ ఉండాలని కోరుకుంటారో, అవన్నీ ఈ టీజర్ లో ఉంటుందట. మెహర్ రమేష్ తాను ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటి నుండి ఆయన కెరీర్ లో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు.

- Advertisement -

టాప్ హీరోల సంగతి సరేసరి, మీడియం రేంజ్ హీరోలు కూడా మెహర్ రమేష్ తో సినిమాలు చెయ్యడానికి భయపడతారు. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడంటే కచ్చితంగా తనని తాను నిరూపించుకునేందుకు మెహర్ రమేష్ ఈ సినిమాని చాలా కసితో తీసాడని అంటున్నారు.మరి ఆయన ఎంత కసితో తీసాడు అనేది ఎల్లుండి విడుదల అవ్వబొయ్యే టీజర్ తో అందరికీ ఒక క్లారిటీ వస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here