Unstoppable with NBK 2 : భలే మోసగాళ్లు.. ప్రభాస్​ను చీట్ చేసిన రామ్ చరణ్, గోపిచంద్

- Advertisement -

Unstoppable with NBK 2 : హోస్ట్​గా నందమూరి బాలకృష్ణ దుమ్మురేపుతున్న షో అన్​స్టాపబుల్. ఈ షోకు వచ్చిన క్రేజ్ చూసిన మేకర్స్ బాలయ్య బాబుతో Unstoppable with NBK 2 కూడా తీస్తున్నారు. చంద్రబాబు నాయుడు గెస్ట్​గా షురూ అయిన సెకండ్ సీజన్ సీనియర్ రాజకీయనాయకులు, యంగ్ హీరోల ఎపిసోడ్స్​తో దూసుకెళ్తోంది. అయితే బాలయ్య షోకు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వంటి హీరోలను కూడా తీసుకురావాలని ఫ్యాన్స్ చాలా రోజులుగా కోరుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికైతే ప్రభాస్​తో సరిపెట్టారు మేకర్స్. సీజన్ ఎండింగ్ పవన్ కల్యాణ్​తో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Unstoppable with NBK 2
Unstoppable with NBK 2

అయితే ప్రభాస్ అన్​స్టాపబుల్ షోకు వస్తున్నాడని తెలియగానే ఫ్యాన్స్​లో ఆనందం అంతా ఇంతా కాదు. పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ గురించి బాలయ్య ఏం ప్రశ్నలు వేస్తాడో.. వాటికి ప్రభాస్ ఎలా సమాధానం చెబుతాడోనని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్​కు సంబంధించి గింప్ల్స్, ప్రోమో వదిలారు. అవి ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ ప్రోమో చూసి ప్రభాస్ ఇంట్రావర్ట్ నుంచి ఎక్స్​ట్రావర్ట్​గా మారిపోయాడని ఫ్యాన్స్ సంబుర పడిపోతున్నారు.

అన్​స్టాపబుల్​ నెక్స్ట్ ఎపిసోడ్ గురించి అందరిలో అంతులేని ఆసక్తి నెలకొంది. ఈ ఎపిసోడ్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్​గా వస్తున్నాడు. ప్రభాస్​తో పాటు గోపీచంద్ కూడా బాలయ్యతో కలసి సందడి చేయబోతున్నాడు. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. అదిరిపోయే స్టఫ్​తో ఈ ప్రోమో కట్ చేశారు. ఈ ప్రోమోలో చాలా విశేషాలు ఉన్నాయి. బాలయ్య ప్రభాస్​కు మహారాజు తరహాలో ఘనస్వాగతం పలికాడు. ప్రభాస్ నామధేయస్య.. బహుపరాక్ బహుపరాక్ అంటూ వెల్​కమ్ చెప్పాడు. ప్రభాస్ ఎంట్రీ తర్వాత బాలకృష్ణ అసలైన హంగామా మొదలు పెట్టాడు.

- Advertisement -

సభాముఖంగా ప్రేమగా అడుగుతున్నా.. నన్ను కూడా నువ్వు డార్లింగ్ అని పిలవాలి అని బాలయ్య ప్రభాస్​ని అడిగాడు. ప్రభాస్.. సరే డార్లింగ్ సర్ అని అన్నాడు. ఇక బాలయ్య ప్రభాస్​ని పెళ్లి కబుర్లతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు. ‘మొన్నామధ్య శర్వానంద్ వచ్చాడు. పెళ్లెప్పుడు అని అడిగితే ప్రభాస్ తర్వాత అని చెప్పాడు. మరి నీ పెళ్లి సంగతేంటి” అని అడిగాడు బాలయ్య.

దీనికి ప్రభాస్ బదులిస్తూ అయితే నేను సల్మాన్ ఖాన్ తర్వాత అని చెప్పాలేమో అని అన్నాడు. ‘నీ లైఫ్ లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏంటి’ అని అడిగితే సమాధానం చెప్పడానికి ప్రభాస్ సిగ్గుపడిపోయాడు. ‘ఆ రోజుల్లో మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ మాకు అనవసరమైన గోల ఎక్కువ’ అని గాసిప్స్ గురించి ప్రభాస్ ఫన్నీగా చెప్పాడు. ‘ఆ రోజుల్లో మేము సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేసేవాళ్లమో తెలుసా’ అని బాలయ్య అనగా.. ‘అయితే ఎన్ని న్యూస్ లు వచ్చి ఉంటాయో’ అని ప్రభాస్ అన్నాడు. దీనితో నవ్వులు పూశాయి.

ఇంతలో బాలకృష్ణకి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ చేసింది మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్​ చరణ్. రామ్​ చరణ్ బాలయ్య ముందు ప్రభాస్ గురించి ఏదో సీక్రెట్ లీక్ చేసినట్లు ఉన్నాడు. దీంతో ప్రభాస్.. ఓయ్ చరణ్.. రేయ్ నువ్వు నా ఫ్రెండా శత్రువా అంటూ వాపోయాడు. ఆ సీక్రెట్ ఏంటనేది.. ఆ తర్వాత వచ్చిన హీరో గోపీచంద్ హింట్ ఇచ్చాడు. చరణ్ చెప్పింది రాణి గురించేనా అని గోపీచంద్ అనగా రేయ్ రేయ్ అంటూ ప్రభాస్ గోపీచంద్​పై విరుచుకుపడ్డాడు. ఇదంతా అక్కడ సందడి తీసుకొచ్చింది. ఇలా రామ్ చరణ్, గోపీచంద్ ఇద్దరూ ప్రభాస్​కు బెస్ట్ ఫ్రెండ్స్.. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి బాలయ్య షోలో ప్రభాస్​ను చీట్ చేశారని.. భలే మోసగాళ్లు అని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here