మరోసారి తెరపైకి ప్రభాస్ అనుష్కల పెళ్లి.. ఈసారి డైరెక్ట్ గా చెప్పేశారు

- Advertisement -

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ హీరోస్‌లో ప్ర‌భాస్ ఒక‌రు. ఇప్పుడు ఆయ‌న పాన్ ఇండియ‌న్ స్టార్‌. బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ పెళ్లి మాత్రం ఎప్పుడ‌నేది క‌న్‌ఫ‌ర్మ్‌గా ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు. ప్రభాస్ పెళ్లికి సంబంధించిన సోష‌ల్ మీడియాలో వార్త‌లు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్ర‌భాస్‌, అనుష్క పెళ్లి చేసుకుంటార‌నే దానిపై న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంది. తాజాగా మరోసారి వీరిద్దరి పెళ్లి విషయం నెట్లో వైరలవుతోంది. ఇంతకు ఆ విషయం ఏమిటంటే..

ప్రభాస్ అనుష్కల పెళ్లి
ప్రభాస్ అనుష్కల పెళ్లి

అటు ప్రభాస్ కానీ ఇటు అనుష్క కానీ వీళ్ల పెళ్లిపై వస్తున్న వార్తలు నిజమని ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. ప్రభాస్, అనుష్క ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చినా పెళ్లి గురించి ప్రశ్నకు ఎదురవుతూనే ఉంటాయి. ఆ ప్రశ్నలకు ప్రభాస్, అనుష్క కూడా తమదైన శైలిలో సమాధానాలను ఇస్తూ ఉంటారు. అయితే రాధేశ్యామ్ మూవీ ట్రైలర్ లో ప్రభాస్ నా చేతిలో ప్రేమ, పెళ్లి లేవంటూ డైలాగ్ చెప్పగా ఆ డైలాగ్ హాట్ టాపిక్ అయింది. ప్రభాస్ ఫ్యాన్స్ తెగ షేర్ చేసేశారు. అంతే కాదు అది ప్రభాస్ పెళ్లిపై తన అభిప్రాయమని కూడా అనుకున్నారు.

తాజాగా తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి టీజర్ విడుదలైంది. పి మహేష్ బాబు డైరెక్షన్ లో కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. టీజర్ లో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా కనిపించగా అనుష్క చెఫ్ గా కనిపించారు.

- Advertisement -

ఈ సినిమాలో అనుష్క స్లిమ్ లుక్ లో కనిపించారు. ప్రోమోలో జయసుధ “నా కూతురు ఏమైనా సామాన్యురాలు అనుకుంటున్నావా ఎప్పటికీ పెళ్లి చేసుకోదు పో ఇంకెవరినైనా చూసుకోరా” అనే డైలాగ్ ను అనుష్కను ఉద్దేశించి నవీన్ పోలిశెట్టికి చెబుతారు. దీనిపై పలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ అనుష్క ఇద్దరు పెళ్లిపై చెప్పిన డైలాగులను చూసి.. వీళ్లిద్దరు పెళ్లి చేసుకోమని డైరెక్ట్ గా చెప్పేశారని అనుకుంటున్నారు ఫ్యాన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here